Piles : పైల్స్.. మూలశంక.. పేరేదైనా, ఏ భాషలో చెప్పినా ఈ సమస్య వచ్చిందంటే అప్పుడు పడే బాధ ఎలాంటిదో అది మాటల్లో చెప్పలేం. కాలకృత్యాలు తీర్చుకుంటానికి వెళ్లినప్పుడల్లా టాయిలెట్‌లో నరక యాతన అనుభవించాల్సిందే. అనంతరం కూడా మంట, నొప్పితో సతమతం అవ్వాల్సిందే. అయితే పైల్స్ అనేవి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మలబద్దకం, థైరాయిడ్, డయాబెటిస్, మాంసం, ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్కువగా కూర్చుని ఉండడం.. వంటివి దాని వెనుక ఉన్న కొన్ని కారణాలు. అవి మనకు తెలిసినవి. తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ఏ కారణం వల్ల పైల్స్ వచ్చినా అవి ఓ పట్టాన మానవు. ఈ క్రమంలో కింద ఇచ్చిన కొన్ని చిట్కాలను పాటిస్తే దాంతో పైల్స్ నుంచి విముక్తి పొందవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని బిర్యానీ ఆకులు (బే లీవ్స్), మూడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అనంతరం ఆ నీటిని 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మిశ్రమం మరిగాక దాన్ని చల్లార్చి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తుంటే పైల్స్ బాధించవు. చమోమిల్ (తెల్ల చామంతి) పూవును తీసుకుని దాన్ని నీటిలో వేసి డికాక్షన్ కాయాలి. ఆ డికాక్షన్‌ను చల్లార్చి సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఫలితం ఉంటుంది. చిన్న గ్లాస్‌లో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కొన్ని కాటన్ బాల్స్ వేసి నానబెట్టాలి. కొద్ది సేపు ఆగాక వాటిని తీసి సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే పైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
కలబంద (అలోవెరా) ఆకులను తీసుకుని వాటిని మధ్యలోకి చీల్చి వాటి నుంచి గుజ్జును సేకరించాలి. దాన్ని పైల్స్‌పై అప్లై చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్‌పై రాయాలి. దీంతో వాటి నుంచి వెంటనే ఉపశమనం లబిస్తుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలో తీసుకుని అందులో కాటన్ బాల్స్ ముంచి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో పైల్స్ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నందున ఇది పైల్స్‌కు తక్షణ ఉపశమనంగా పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్ ను ఆముదం లేదా బాదం నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్‌పై రాస్తూ ఉండాలి. దీంతో కొద్ది రోజుల్లోనే పైల్స్ తగ్గిపోతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…