Turmeric Milk : పాల‌ల్లో ప‌సుపు క‌లిపి తాగితే ఇన్ని లాభాలా.. తెలిస్తే వెంట‌నే తాగుతారు..!

December 10, 2023 7:03 PM

Turmeric Milk : పసుపుని మనం పురాతన కాలం నుండి కూడా, వంటల్లో వాడుతున్నాము. పసుపు వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చాలా రకాల అనారోగ్య సమస్యల్ని పసుపు తొలగిస్తుంది. పసుపు ని రెగ్యులర్ గా వంటల్లో వాడితే, చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు. అలానే, కాఫీ, టీ తీసుకునే వాళ్ళు, చక్కెర ని ఉపయోగించడం మంచిది కాదు. అలానే, ఇప్పుడు ఆహార పదార్థాల విషయంలో చాలా మార్పు వచ్చింది. ఇది వరకు నెయ్యి, పల్లీ నూనె, నువ్వుల ఇటువంటివన్నీ కూడా స్వచ్ఛంగా తయారు చేసుకొని ఉపయోగించేవారు.

ఇప్పుడు డబల్ ఫిల్టర్ రిఫైండ్ ఆయిల్ వాడినా కూడా, గుండె జబ్బులు రావడం, మళ్ళీ వాటి కోసం మందులు వాడడం, ఆహార పదార్థాలలో మార్పు రావడంతోనే రకరకలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గ్యాస్, ఎసిడిటీ, తలనొప్పి, కడుపులో తిప్పడం వంటివి ఎక్కువ వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు, ఆయుర్వేదము ని ఉపయోగించడం మంచిది. పసుపు పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఒక గ్లాసు పాలల్లో, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని, 10 నిమిషాలు పాటు వేడి చేసి, పడుకునే అరగంట ముందు తాగితే మంచిది.

Turmeric Milk many wonderful health benefits
Turmeric Milk

ఇలా తాగితే, మంచి నిద్ర ని పొందవచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్లు, పంచదార కాకుండా పాలల్లో తేనె కానీ బెల్లం కానీ వేసుకోవడం మంచిది. చర్మ సమస్యలు, మొటిమలు, ముడతలు, దురదలు తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. పసుపు పాలని రెగ్యులర్ గా తీసుకుంటే అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.

పసుపు పాలని రోజు తీసుకోవడం వలన, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు కూడా ఈజీగా తగ్గిపోతాయి. జలుబు సమస్య కూడా ఉండదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలని పొందొచ్చు. మరి రెగ్యులర్ గా, పసుపు పాలు తీసుకుని ఎలాంటి లాభాలను పొందవచ్చో చూసారు కదా..? ఈసారి రోజూ తీసుకుని. ఈ సమస్యలకి దూరంగా వుండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now