Papaya : బొప్పాయి పండు తింటే మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక డెంగీ వచ్చిన వారు ప్లేట్‌లెట్లు కోల్పోతుంటే బొప్పాయి పండు ద్వారా వాటిని పెంచుకోవచ్చు. రక్తం కూడా పెరుగుతుంది. అయితే బొప్పాయి పండును తినేవారు మాత్రం కింద ఇచ్చిన కొన్ని సూచనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే పండు తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. అవును, మీరు విన్నది కరెక్టే. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
గర్భిణీలు బొప్పాయి పండును ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే పలు రసాయనాలు నేరుగా గర్భాశయంపై ప్రభావం చూపుతాయి. దీంతో అబార్షన్ జరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక బొప్పాయి పండును గర్భిణీలు తినరాదు. మనం తిన్న ఆహారాన్ని నోటి నుంచి జీర్ణాశయానికి అన్నవాహిక చేరవేస్తుంది. అయితే బొప్పాయి పండు వల్ల కొందరిలో ఈ అన్నవాహిక దెబ్బ తినవచ్చు. అంతేకాకుండా ఈ పండును బాగా తింటే ఎవరికైనా అన్న వాహికకు ఎఫెక్ట్ అవుతుంది. కనుక ఎప్పుడు ఈ పండును తిన్నా ఒక కప్పుకు మించరాదు.
గర్భిణీలే కాదు, పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండును తినరాదు. తింటే వారు ఇచ్చే పాలతో పలు రసాయనాలు బిడ్డ శరీరంలోకి వెళ్తాయి. దీంతో అవి శిశువులకు లోపాలను కలిగిస్తాయి. అనంతరం అవి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కనుక పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండును తినరాదు. బొప్పాయి పండు కొందరికి పడదు. అలర్జీని కలిగిస్తుంది. కనుక ఎవరు ఈ పండును తిన్నా ముందుగా ఒక చిన్న ముక్క తిని ఫరవాలేదు అనుకుంటేనే తినడం ఉత్తమం. బీపీ సమస్యతో బాధపడేవారు, బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే వారు బొప్పాయి పండును తినరాదు. తింటే సమస్య తీవ్రతరమవుతుంది.
లో బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు బొప్పాయి తినరాదు. తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఇంకా పడిపోతాయి. కనుక వారు తినరాదు. బొప్పాయి పండును తినే పురుషులు వాటి విత్తనాలను తినకుండా, అవి లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి పురుషుల్లో వీర్యాన్ని నాశనం చేస్తాయి. ఇక బొప్పాయి పండును ఎవరైనా చాలా తక్కువగా తినాలి. రోజూ తినవచ్చు కానీ ఒక కప్పు మించకూడదు. మించితే శరీరంలో బెంజైల్ ఇసోథయోసయనేట్ అనే విష పదార్థం పేరుకుపోయి దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. కనుక ఈ సూచనలను పాటిస్తూ బొప్పాయి పండ్లను తినాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…