Thalambrala Mokka : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకంటే..?

December 11, 2023 3:55 PM

Thalambrala Mokka : మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి. కానీ, మనం వాటిని తేలికగా తీసి పారేస్తూ ఉంటాము. ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా, మన చుట్టూ చాలా ఉంటాయి. కొన్ని కొన్ని మొక్కలని, మనం చూసి ఎందుకు పనికిరావు అని అనుకుంటూ ఉంటాము. కానీ తెలియకుండా అవి పనికిరావని తేలికగా తీసేయకూడదు. కొన్ని మొక్కల వలన చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. తలంబ్రాలు మొక్క గురించి చాలామందికి తెలియదు. ఎక్కడపడితే అక్కడ ఎక్కువగా కనపడుతుంది. రోడ్డు పక్కన, పొలాల గట్ల మీద కూడా ఈ మొక్క ఉంటుంది. ఎక్కువగా గ్రామాలలో ఈ మొక్కలు మనకి కనపడుతూ ఉంటాయి. కాలువలకి ఇరువైపులా కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే, చాలా మందికి ఈ మొక్క గురించి పెద్దగా తెలియదు. గ్రామాల్లో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది.

ఒకవేళ కనుక ఈ మొక్క దొరికితే, ఈ లాభాలు ని పొందవచ్చు. ఈ మొక్క కి సంబంధించి మొత్తం 150 జాతులు వరకు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్టుని లంబాడి చెట్టు, గాజు కంపా అని కూడా పిలుస్తారు. చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా, ఈ మొక్క బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా గజ్జి, తామర వంటి చర్మ సమస్యల చికిత్సలో కూడా దీనిని వాడుతూ ఉంటారు. ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడడం జరుగుతుంది.  క్రిమినాశక మరియు యాంటీ మైక్రోబెల్ లక్షణాలు వలన గాయాలని నయం చేయడానికి, ఇది సహాయం చేస్తుంది.

Thalambrala Mokka amazing health benefits must know about them
Thalambrala Mokka

పల్లెల్లో ఉన్న వాళ్ళు, ఈ మొక్క ఆకుల్ని నలిపి కడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వయసు సంబంధం లేకుండా, చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ల నొప్పులు వస్తే పెయిన్ కిల్లర్ వంటివి వేసుకోవడం కంటే, ఈ ఆకుల్ని ఆముదంతో కలిపి మెత్తని పేస్ట్ గా చేసుకుని, నొప్పి ఉన్నచోట రాసుకుని ఒక క్లాత్ గట్టిగా కట్టేస్తే, చక్కటి ఫలితం ఉంటుంది.

నొప్పి నుండి ఉపశమనం వెంటనే కలుగుతుంది. రాత్రి నిద్ర పోయేటప్పుడు, మీరు ఈ ఆకుల పేస్ట్ ని రాసుకోవచ్చు. కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, కండరాల నొప్పులు వంటివి తగ్గిపోతాయి. దగ్గు, గొంతు నొప్పి తగ్గడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ తలంబ్రాలు చెట్టు ఆకుల్ని ఎండబెట్టుకుని పొగ కింద వేస్తే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now