Telagapindi : చాలామంది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తెలియక దూరం పెట్టేస్తూ ఉంటారు. కానీ నిజానికి కొన్ని ఆహార పదార్థాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అయితే వాటిని వీలైనంత వరకు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే వేరుశనగ నూనె ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుందని, వేరుశనగ నూనెను తీసుకుంటే ఎన్నో లాభాలను పొందచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు.
నిజానికి వేరుశనగ నూనెలో ఎటువంటి పోషకాలు ఉండవు. కేవలం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఆ నూనెను వేరు చేయగా మిగిలిన పిప్పిని తెలగపిండి అంటారు. దీనిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. తెలగపిండిని తీసుకుంటే హార్మోన్ల ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కండ పుష్టికి కూడా ఇది బాగా మేలు చేస్తుంది. తెలగపిండిలో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు.
అధిక బరువు కలవారు కూడా దీన్ని తీసుకోవచ్చు. హై ప్రోటీన్స్ కలిగిన తెలగపిండిని గర్భిణీలు తీసుకుంటే బలంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రసవం జరిగిన తర్వాత స్త్రీలు ఆహారంలో దీన్ని తీసుకుంటే నీరసం ఉండదు. సామర్ధ్యం పెరుగుతుంది. బలంగా ఉంటారు. ఏదో ఒక రూపంలో తెలగపిండిని తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. అనేక రకాల కూరల్లో మనం తెలగపిండిని వేసుకోవచ్చు. వేరుశెనగ కంటే ఎక్కువ ప్రోటీన్ దీనిలో ఉంటుంది.
ఆకుకూరలతో లేదంటే శనగపప్పుతో వండుకోవచ్చు. చాలామంది తెలగపిండిని డ్రైఫ్రూట్స్ తోపాటు లడ్డూల లాగా చేసుకుని తీసుకుంటూ ఉంటారు. వృద్ధులకి, పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా సరే తెలగపిండి మంచే చేస్తుంది. తెలగపిండిని వడియాల లాగా కూడా పెట్టుకోవచ్చు. దీని ధర కూడా తక్కువే. కాబట్టి తెలగపిండిని మనం డైట్ లో తీసుకుని ఈ లాభాలని పొందవచ్చు. తెలగపిండిలో కొంచెం ఖర్జూరం పొడి, తేనె, నెయ్యి, బెల్లం వేసి పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు. బీరకాయ, తెలగపిండి కలిపి కూర కూడా చేసుకోవచ్చు. ఆకుకూరలు, వెల్లుల్లితో కూడా వండుకోవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…