Heart Attack : సాయంత్రం పూట వీటిని తింటే హార్ట్ ఎటాక్ రాదు..!

October 28, 2023 11:53 AM

Heart Attack : ఈరోజుల్లో చాలామంది, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా, హృదయ సంబంధిత సమస్యలతో, చాలామంది సఫర్ అవుతున్నారు. హృదయ సమస్యలు ఏమి లేకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం పూట, వీటిని తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాదు. చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.. ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం.

ఈరోజుల్లో చాలామంది, ఆహారం తీసుకునే విధానంలో తప్పులు చేస్తున్నారు. జంక్ ఫుడ్ వంటి వాటిని ఎక్కువగా తింటున్నారు. అలానే, వ్యాయామం చేయడం కూడా చాలామంది మానేశారు. చాలామంది, ఈరోజుల్లో అన్నం తినడం కూడా మానేశారు. పైగా ఫ్యాట్ ఉండే వాటిని తినట్లేదు. కేవలం ప్రోటీన్ మాత్రమే తీసుకుంటున్నారు. ప్రోటీన్ ఎక్కువగా మనకి మాంసాహారం ద్వారా దొరుకుతుంది. అలానే గుడ్లు కూడా ప్రోటీన్ ఉంటుందని, చాలామంది తింటూ ఉంటారు. శాకాహారులు ఏం చెయ్యాలి..? వాళ్లకి కూడా ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయి.

take these foods evening to prevent Heart Attack
Heart Attack

వేరుశనగ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అన్నిటికంటే కూడా, వేరుశనగలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సోయాలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. రాజ్మాలో కూడా, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఈ మూడిట్లో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి, శాఖాహారులు ప్రోటీన్ ఎక్కువ వుండే, ఆహార పదార్థాలను తీసుకోవాలంటే, ఈ మూడు తీసుకోవచ్చు. అన్నం తీసుకోకుండా అన్నానికి బదులుగా, క్యాలరీలు అంతే సమానంగా ఉండే వాటిని మనం తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు.

ఇలా అన్నం మానేసి, కొలెస్ట్రాల్ని తగ్గించుకుని మనం శక్తి పొందవచ్చు. అయితే కావాల్సిన శక్తి అన్నం కాకుండా అన్నానికి బదులుగా ప్రోటీన్ ద్వారా పొంది, ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచించారు. కాబట్టి, కొలెస్ట్రాల్ పెరిగి పోతోందన్నా, లేదంటే హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలన్నా వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. అన్నం మానేసి, క్యాలరీలు పొందాలని ఎనర్జీని పొందాలని అనుకునే వాళ్ళు వీటిని తీసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now