Heart Health : వీటిని రోజూ తింటే.. మీకు హార్ట్ ఎటాక్ అస‌లు రాదు..!

August 31, 2023 12:00 PM

Heart Health : ఆరోగ్యంగా ఉండడం కోసం, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారపదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుండాలంటే కూరగాయలు, పండ్లు వంటివి తీసుకుంటూ ఉండాలి. అయితే, కొన్ని రకాల కూరగాయలు గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వలన రక్తనాళాలని అవి కాపాడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, రోజు వ్యాయామం చేయడం వంటివి చేస్తూ ఉండాలి.

ఎక్కువగా ఈ రోజుల్లో చాలామంది గుండె జబ్బులకి గురవుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి రక్తనాళాలు కూడా ఎంతో ముఖ్యం. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. బ్రోకలీ, మొలకలు, క్యాబేజీ వంటి వాటిని మీరు డైట్ లో చేర్చుకుంటే, ఇటువంటి సమస్యలు ఏమి కూడా కలగవు. వాస్కులర్ డిసీజెస్ రక్తనాళాలని ప్రభావితం చేస్తాయి. శరీరం చుట్టూ రక్త ప్రవాహాన్ని తగ్గించేస్తుంది. కొవ్వు, క్యాల్షియం నిక్షేపాలు గుండెపోటు, స్ట్రోక్ కి కారణం అవుతాయి.

take these foods daily for Heart Health
Heart Health

అయితే, ఈ కూరగాయలను తీసుకుంటే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు ఏమీ కూడా ఉండవు. విటమిన్ కె వుండే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవడం వలన చాలా వరకు నష్టం కలగకుండా ఉంటుంది. విటమిన్ కె ఆకుపచ్చని కూరగాయల‌లో ఉంటుంది. ప్రతిరోజు కూడా 45 గ్రాముల కంటే ఎక్కువ పచ్చి కూరలు తీసుకోండి. ఆకుకూరలను తీసుకుంటే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు.

ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ప్రతిరోజు పండ్లు, సీ ఫుడ్, లీన్ మీట్, పాల‌తో పాటుగా ఆరోగ్యకరమైన నూనెలని, గింజలని తీసుకుంటూ ఉండాలి. మంచిగా కూరగాయలను ప్రతిరోజు డైట్ లో చేర్చుకుంటూ ఉండాలి. ఇలా కనుక మీరు మంచి ఆహార పదార్థాలను తీసుకుంటున్నట్లైతే, కచ్చితంగా గుండె జబ్బులు వంటి బాధలు ఏమీ కూడా కలగవు. ముఖ్యంగా కూరగాయలకి, ఆకుకూరలకి ప్రాధాన్యత ఇవ్వండి. డైట్ లో వీటిని చేర్చుకోవడం వలన చక్కటి పోషకాలు లభించి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment