Heart Stroke : హార్ట్ బ్లాక్స్ క‌రిగి.. గుండె పోటు రావొద్దంటే.. వీటిని తినండి..!

August 7, 2023 6:30 PM

Heart Stroke : పూర్వం పెద్దవాళ్లు మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకునేవారు. పైగా సరైన జీవన విధానాన్ని ఫాలో అవుతూ ఉండేవారు. కానీ, ఈ రోజుల్లో తినే ఆహార పదార్థాలు మారిపోయాయి. దానితో పాటుగా జీవన విధానం కూడా పూర్తిగా మారిపోయింది. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి ఇలా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దానితో అనారోగ్య సమస్యలు కూడా బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి.

అయితే, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, హార్ట్ ఎటాక్ రాకుండా జాగ్రత్త పడాలన్నా ఇటువంటి చిట్కాలని పాటించడం మంచిది. గుండె సమస్యల కారణంగా, చాలా మంది ప్రాణాలను కోల్పోవడం కూడా జరుగుతోంది. గుండె ఆరోగ్యం గా ఉండాలంటే, తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. రోజువారి ఆహారంలో 60 శాతం వరకు పండ్లు, సలాడ్స్ వంటి వాటిని తీసుకోవాలి.

take fiber rich foods daily to prevent Heart Stroke
Heart Stroke

మొలకలు నచ్చితే కూడా తీసుకుంటూ ఉండాలి. పండ్ల రసాలు వంటి వాటిని కూడా తీసుకోమని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఉడికించే ఆహారం తీసుకునేటప్పుడు, తక్కువ నూనె, తక్కువ సాల్ట్ ని తీసుకోండి. అలా చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. గుండె ఆరోగ్యం బాగుండాలంటే, ప్రాణాయామ ఏరోబిక్ వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఈ వ్యాయామ పద్ధతుల్ని పాటించడం వలన బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. అది కూడా ఎక్కువ శ్రమ పడకుండానే.

ప్రతిరోజు 45 నిమిషాలు ఉదయం, 45 నిమిషాలు సాయంత్రం వీటి కోసం సమయం పెట్టండి. ఒత్తిడి కారణంగా కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. బీపీ తగ్గాలంటే, ఒత్తిడికి దూరంగా ఉండాలి. అందుకు మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వలన హార్ట్ ఎటాక్ వంటి బాధల నుండి బయటపడొచ్చు. కాబట్టి ప్రతిరోజు వీటిని ఆచరించి ఆరోగ్యంగా జీవించండి. గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment