Spicy Food In Monsoon : వ‌ర్షాకాలంలో స్పైసీ ఫుడ్ అస‌లు తిన‌కండి.. ఎందుకంటే..?

September 8, 2023 5:35 PM

Spicy Food In Monsoon : వానా కాలంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. లేదంటే అనవసరంగా అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వానా కాలంలో ఎవరికైనా సరే వేడి వేడి ఆహార పదార్థాలు, స్పైసీ ఫుడ్ తీసుకోవాలని ఉంటుంది. బయట ఫుడ్ కి ఈజీగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టకపోతే కచ్చితంగా అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి. వానా కాలంలో స్పైసీ ఫుడ్ తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వానా కాలంలో స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం వలన ప్రమాదం కలుగుతుంది. ఘాటైన మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే రకరకాల సమస్యలు వస్తాయి. వర్షా కాలంలో కారం, మసాలాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అరుగుదల తక్కువ ఉంటుంది. దీంతో జీవక్రియపై ప్రభావం పడుతుంది. మసాలాలతో కూడిన ఆహార పదార్థాల‌ను అసలు వానా కాలంలో తినకండి.

Spicy Food In Monsoon is unhealthy for us
Spicy Food In Monsoon

వానా కాలంలో ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యానికి కూడా ప్రమాదం. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, గుండె సమస్యలు రాకుండా ఉండాలన్నా స్పైసీ ఫుడ్ ని తీసుకోవద్దు. జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ని తీసుకుంటే హై కొలెస్ట్రాల్, హై బీపీ సమస్యలు వస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అదే విధంగా పేగులు ఆరోగ్యంగా ఉంటేనే మనం తినే ఆహారం జీర్ణం అవుతుంది.

బ్యాలెన్స్డ్‌ ఫుడ్ తీసుకుంటేనే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఉప్పు, స్పైసీ ఫుడ్ ని అసలు తీసుకోకూడదు. ఆరోగ్యానికి మేలు చేయని ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వానా కాలంలో స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం, జంక్ ఫుడ్ ని తీసుకోవడం పూర్తిగా మానేయండి. అలాగే వానా కాలంలో బయట పదార్థాలని కూడా తినకండి. వానా కాలంలో పానీపూరీ మొదలైన వాటిని కొనుగోలు చేసి తీసుకుంటే రకరకాల సమస్యలు వస్తాయి. అంత‌గా తినాల‌ని అనిపిస్తే ఇంట్లోనే చేసుకుని తినండి. అంతేకానీ బ‌య‌టి ఫుడ్‌ను తిన‌కండి. ఇలా కొన్ని సూచ‌న‌లు పాటిస్తే వ‌ర్షాకాలంలో వ‌చ్చే వ్యాధుల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment