Mint Leaves : రోజూ ఒక క‌ప్పు పుదీనా జ్యూస్ చాలు.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

February 26, 2023 8:21 AM

Mint Leaves : మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆకుకూర‌ల్లో పుదీనా కూడా ఒక‌టి. దీని వాసన చాలా బాగుంటుంది. అందుక‌నే పుదీనాను చాలా మంది ప‌లు కూరల్లో వేస్తుంటారు. కొంద‌రు పుదీనాతో ఏకంగా చ‌ట్నీల‌ను చేసుకుని తింటుంటారు. పుదీనా నిజానికి మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిస్తుంది. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే గుణాలు ఇందులో ఉంటాయి. క‌నుక వేస‌విలో పుదీనాను క‌చ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనాను వేస‌విలో మ‌జ్జిగ‌లో వేసుకుని తాగ‌వచ్చు. లేదా నేరుగా పుదీనా ర‌సం తీసుకోవ‌చ్చు. అది కూడా వ‌ద్దనుకుంటే పుదీనాను స‌లాడ్స్ లో వేసుకుని తిన‌వ‌చ్చు. లేదా పుదీనా టీ తాగ‌వ‌చ్చు. ఎలా తీసుకున్నా పుదీనాతో మ‌న‌కు లాభ‌మే క‌లుగుతుంది.

1. పుదీనాను తీసుకోవ‌డం వ‌ల్ల ఎండాకాలంలో మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. ఎండ‌లో బాగా తిరిగేవారు ఇంటికి చేరుకోగానే పుదీనా మ‌జ్జిగ తాగితే శ‌రీరం వెంట‌నే చ‌ల్ల‌బ‌డుతుంది.

Mint Leaves benefits take daily one cup juice
Mint Leaves

2. వేస‌విలో మాంసాహారం తింటే కొంద‌రికి ప‌డ‌దు. అందుకని వారు పుదీనాను ఆహారంలో భాగం చేసుకుంటే శ‌రీరం వేడి చేయ‌కుండా ఉంటుంది.

3. జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు పుదీనాను తీసుకుంటే ఆ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

4. ద‌గ్గు, జ‌లుబు, నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పుదీనాను తింటే ఫ‌లితం ఉంటుంది.

5. పుదీనాను రోజూ తింటే మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుందని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment