Liver Health : లివ‌ర్ మొత్తం క్లీన్ అయి ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తినండి..!

November 9, 2023 7:39 PM

Liver Health : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు. లివర్ సమస్యలు రాకుండా, లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే, కచ్చితంగా లివర్ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. మన శరీరంలో, అతి ముఖ్యమైన అవయవం లివర్. శరీరంలో విష పదార్థాలని, బయటకి పంపిస్తుంది లివర్. అలానే విటమిన్స్ ని స్టోర్ చేసి, ఎనర్జీ కింద లివర్ మారుస్తుంది. లివర్ యాక్టివిటీ ఎప్పుడు నియంత్రణలో ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి ఒక్కరు, లివర్ ఆరోగ్యం కోసం చూసుకోవాలి. రక్తంలో కలిసిన వ్యర్ధపదార్థాలని, లివర్ బయటకి పంపిస్తుంది. లివర్ సరిగ్గా పనిచేయకపోతే, శరీరంలో ఎన్నో వ్యవస్థలు కుప్పకూలిపోతుంటాయి.

లివర్ సురక్షితంగా ఉండడానికి, ప్రతి ఒక్కరు శ్రద్ధ పెట్టాలి. లివర్ సురక్షితంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమైనది. లివర్లో కొన్ని వ్యర్ధాలు పేర్కొన్నప్పుడు, ఈ లక్షణాలు కనబడతాయి. లివర్ సమస్యలు ఉన్నట్లయితే ఒత్తిడి, ఆందోళన, శరీరం నుండి దుర్వాసన రావడం, గ్యాస్, ఎసిడిటీ ఇలా అనేక సమస్యలు వస్తాయి. కడుపునొప్పి, తియ్యటి పదార్థాలను ఎక్కువ తినాలనిపించకపోవడం, దద్దుర్లు ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. లివర్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే, బీట్రూట్ ని తీసుకోవడం మంచిది.

Liver Health take these foods to clean it
Liver Health

బీట్రూట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. అలానే, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే కూడా లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఆరెంజ్, బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి. అలానే, లివర్ ఆరోగ్యంగా ఉండడం కోసం, వాల్నట్స్ ని కూడా తీసుకోండి. వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. పాలిఫినోస్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి.

వాల్నట్స్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ద్రాక్ష, నల్ల ద్రాక్ష యాంటీ ఆక్సిడెంట్లు ని పెంచుతాయి. గ్రేప్ జ్యూస్ తరచుగా తీసుకుంటే, లివర్ ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. గ్రీన్ టీ ని కూడా తీసుకుంటూ ఉండండి. గ్రీన్ టీ లివర్ లోని విష పదార్థాలని నీటిలో కరిగించేటట్టు చేసి, న్యూట్రల్ చేస్తూ ఉంటుంది. లివర్ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టి, ఈ టిప్స్ ని అనుసరించారంటే, లివర్ ఆరోగ్యం బాగుంటుంది. లివర్ సమస్యలు ఏమి కూడా కలగవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now