Knuckle Cracking : సాధారణంగా మనం శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం..? ఒళ్లు విరవడం, కొంత సేపు లేచి అటు, ఇటు నడవడం లేదా టీ, కాఫీ వంటివి తాగడం తదితర పనులు చేస్తాం. అయితే వీటితోపాటు మరొకటి కూడా ఆ జాబితాలో ఉంది. అదే చేతి వేళ్లు విరవడం. బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువగా పనిచేసే వారు తమ చేతి వేళ్లను ఎక్కువగా విరుస్తారు. ఇలా విరిచే క్రమంలో టక్‌మనే శబ్దం కూడా వాటి నుంచి వస్తుంది. అయితే ఆ శబ్దం ఎందుకు వస్తుంది..? దాని వల్ల లాభమా, నష్టమా..? తెలుసుకుందాం పదండి.
చేతి వేలి జాయింట్లలో సైనోవియల్ ద్రవం ఒకటి ఉంటుంది. దీంట్లో ఓ రకమైన గ్యాస్ ఎప్పటికప్పుడు నిండిపోతుంది. దీంతో చేతి వేళ్లను విరిచినప్పుడు ఈ గ్యాస్ తొలగించబడి దాని స్థానంలో మనకు శబ్దం వినిపిస్తుంది. అయితే ఇలా చేతి వేళ్లను విరవడం వల్ల మనకు లాభమే కలుగుతుందట. నష్టం కలుగుతుందనుకుంటే అది అపోహే అవుతుందట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల జబ్బులు మాత్రం రావు. పలువురు పరిశోధకులు ఇదే విషయంపై పుల్ మై ఫింగర్ స్టడీ పేరిట ఓ పరిశోధన చేశారు. ఈ నేపథ్యంలో వారు ఒక వ్యక్తి తన చేతి వేళ్లను విరిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఓ ఎంఆర్‌ఐ పరికరం ద్వారా పరిశోధనను రికార్డ్ చేశారు. ఈ పరిశోధనకు గ్రెగ్ కౌచక్ అనే శాస్త్రవేత్త నాయకత్వం వహించాడు.
వాక్యూమ్‌తో నిండి ఉండే ఓ ప్రత్యేకమైన కేబుల్‌ను పరిశోధనలో పాల్గొన్న వ్యక్తి చేతి వేళ్లకు ఉంచారు. దీన్ని ఎంఆర్‌ఐ పరికరానికి అనుసంధానం చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి చేతి వేళ్లను విరవగానే వాటికి అనుసంధానమైన కేబుల్స్ లాగబడి ఎంఆర్‌ఐ పరికరం వ్యక్తి చేతిని స్కానింగ్ చేసి రికార్డ్ చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా టక్‌మని శబ్దం వినిపించింది. అయితే ఈ ప్రయోగం మాత్రం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా చేతి వేళ్లు విరవడం వల్ల ఇంకా ఏమేం లాభాలు ఉన్నాయో, నష్టాలు ఉన్నాయో తెలుసుకోవచ్చని వారు అంటున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…