Diabetes Symptoms : నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య తలెత్తుతూనే ఉంది. అయితే వీటిని సూచిస్తూ మన శరీరం ముందుగానే కొన్ని అనారోగ్య లక్షణాలను మనకు తెలుపుతుంది. కానీ మనలో అధిక శాతం మంది ఈ అనారోగ్య లక్షణాలు, సూచనలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. దీంతో సమస్య వచ్చినప్పుడు బాధపడాల్సి వస్తోంది. అయితే శరీరం ఎప్పటికప్పుడు తెలియజేసే అనారోగ్య హెచ్చరికలను ముందుగానే పసిగడితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి.
రక్తంలో చక్కెరలు ఎక్కువగా పేరుకోవడం వల్ల, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాక, ఒకవేళ ఉత్పత్తి అయినా శరీరం దాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల, నిత్యం శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుంది. ఇది వచ్చే క్రమంలో మనకు ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని వల్ల ఎంతో కొంత జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధి ఉంటే నోరు ఎల్లప్పుడూ పొడిగా ఉంటుంది. దీంతోపాటు దాహం ఎక్కువగా వేస్తుంది. మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్తారు. సాధారణంగా రాత్రి పూట ఈ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించవచ్చు. సాధారణంగా నిత్యం శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారు, పనిచేసే వారు అలసిపోతుంటారు. అలా కాకుండానే మామూలుగానే అలసిపోయినట్టుగా ఉంటే వారు తమ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని అర్థం చేసుకోవాలి.
ఎల్లప్పుడూ శక్తి లేనట్టుగా, నీరసంగా, నిస్సత్తువగా ఉంటే వెంటనే షుగర్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. అవసరమైతే వైద్యున్ని సంప్రదించాలి. ఎక్కువగా ఆకలి వేస్తున్నా, చర్మంపై దురదలు వస్తున్నా, బరువు పెరుగుతున్నా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి. షుగర్ ఉంటే జీర్ణక్రియ కూడా మెరుగ్గా పనిచేయదు. దీంతోపాటు గాయాలు, పుండ్లు, దెబ్బల వంటివి త్వరగా మానవు. ఏకాగ్రత కోల్పోవడం, నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలు కూడా హై బ్లడ్ షుగర్‌ను సూచిస్తాయి.
షుగర్ వ్యాధి ఉంటే గ్లయిసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. వీటి వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరకుండా ఉంటాయి. పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే వెంటనే ఆహార సంబంధ జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రధానంగా సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని నిత్యం తీసుకోవాలి. దీంతోపాటు జంక్ ఫుడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…