Kidney Stones : కిడ్నీ స్టోన్స్.. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగా మారింది. మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం, మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో కనిపించే సాధారణ లక్షణాలు. కిడ్నీ స్టోన్స్ వల్ల శరీరం సూచించే హెచ్చరికలను కొంత మంది పెడచెవి పెట్టి తమ ఆరోగ్యాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తుంటారు కూడా. అయితే కింద ఇచ్చిన సందర్భాల్లో కిడ్నీస్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవేమిటో చూద్దాం.
కాల్షియం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినే వారి కంటే తక్కువగా తినే వారికే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాళ్లు ఏర్పడేందుకు కారణమయ్యే ఆక్జలేట్స్‌ను మూత్రాశయంలోకి రానివ్వకుండా కాల్షియం అడ్డుకుంటుంది. ఇందుకోసం అది వివిధ రకాల రసాయనాలతో మిళితమై పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ తొలి దశలో పొట్ట కింది భాగంలో లేదా వెన్నులో నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి ఒక్కోసారి తక్కువగా, ఒక్కో సందర్భంలో ఎక్కువగా ఉండొచ్చు. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి.
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారి మూత్రం రంగు కూడా మారుతుంది. ఎందుకంటే ఆ రాళ్లు మూత్రశాయంలో అటు ఇటు కదులుతూ ఉండడం వల్ల దాంతో ఉండే మూత్రం రంగు మారి అలాగే బయటికి వస్తుంది. ఇది ఘాటైన దుర్వాసనను కలిగి ఉంటుంది. మూత్రాశయంలోకి రాళ్లు వస్తే అవి సదరు అవయవాన్ని వాపులకు గురి చేస్తాయి. ఇది ఎంతగానో ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు దీని వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్లినప్పుడల్లా నొప్పి కూడా ఉంటుంది. అయితే తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, లైంగిక వ్యాధుల వంటి ప్రమేయం కూడా ఉంటుంది. మూత్రాశయంలో కిడ్నీ స్టోన్స్ ఆగిపోతే వారికి ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అలసట, వణుకుతో కూడిన జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సార్లు వికారంగా కూడా అనిపిస్తుంది.
కిడ్నీస్టోన్స్ ఉంటే ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా వస్తుంది. అయితే ఇది ఎరుపు రంగులోనే కాక ఎరుపు, పసుపు మిక్స్ చేసిన డార్క్ రంగులోనూ కనిపిస్తుంది. కుటుంబంలో, వారి రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కిడ్నీ స్టోన్లు ఉంటే వారి నుంచి వారి పిల్లలకు కూడా అవి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ (ఐబీడీ), క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ స్టోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరిలో డయేరియా ఉన్నవారు కూడా ఉంటే అది డీహైడ్రేషన్‌కు దారి తీసి కిడ్నీ స్టోన్లు ఏర్పడేలా చేస్తుంది.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తరచూ వస్తున్నా కూడా కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. ఇలా గనక జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించి అందుకు అనుగుణంగా పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభించాలి. విరేచనకారులు (లాక్సేటివ్స్)ను ఎక్కువగా వాడడం వల్ల కూడా కిడ్నీస్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ లాక్సేటివ్స్ శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కలగజేస్తాయి. తద్వారా శరీరం పోషకాలను తక్కువగా గ్రహిస్తుంది. డీహైడ్రేషన్ కూడా కలుగుతుంది. ఇది కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు కారణమవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…