జొన్నలలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. జొన్నలతో అన్నం వండుకొని తింటారు. అలాగే పిండితో రొట్టెలు, అంబలి వంటివి తయారుచేసుకొని తీసుకోవచ్చు. జొన్నలతో అంబలి ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. జొన్నలను మెత్తని పిండిగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల జొన్న పిండి వేసి దానిలో గ్లాసున్నర నీటిని పోసి పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు లేదా సైంధవ లవణం వేసి ఒక నిమిషం అయ్యాక పొయ్యి మీద నుంచి దించి కొంచెం చల్లారాక గ్లాసులో పోసి అరచెక్క నిమ్మరసం, రెండు చిటికెల మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ విధంగా తయారుచేసిన జొన్న అంబలిని ప్రతి రోజూ తీసుకోవచ్చు. లేదా వారంలో మూడు సార్లు తీసుకోవచ్చు.
ఈ జొన్న అంబలిని తాగటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే అలసట, నీరసం లేకుండా శక్తి ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలని అనుకొనే వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. డయాబెటిస్, రక్తపోటు సమస్యలు ఉన్నవారికి కూడా ఈ అంబలి చాలా సహాయపడుతుంది. శరీరంలో వేడి ఎక్కువ ఉన్నవారిలో వేడి తగ్గించి చలువ చేస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న జొన్న అంబలి తీసుకొని ప్రయోజనాలను పొందవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…