జ్యోతిష్యం & వాస్తు

Birth Marks : పుట్టుమ‌చ్చ‌ల ఫ‌లితాలు.. ఎక్క‌డ పుట్టుమ‌చ్చ ఉంటే.. ఏం జ‌రుగుతుంది..?

Birth Marks : మాన‌వుడి జాత‌కాన్ని నిర్థేశించ‌డంలో పుట్టుమ‌చ్చ‌ల‌దీ ఓ పాత్ర అని చెప్ప‌వ‌చ్చు. వ్య‌క్తుల స్వరూప స్వభావాలను తెల‌ప‌డంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టు మచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా, అదృష్ట.. దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. మాన‌వ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది.

తలపై కుడి భాగంలోనూ, నుదురు మధ్య భాగంలో, కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది. ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై, నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి. ఇక మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా, కుడి భుజం పైన, పొట్ట పైన, హృదయ స్థానంలో, మోచేతి పైన, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలుపై గల పుట్టు మచ్చలు శ్రీమంతులను చేసేవిగా చెప్పబడుతున్నాయి. ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన గానీ, కాలం కలిసిరావడం వలన గాని ధనయోగం కలుగుతుంది. తలపై మాడు భాగానికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే రాజకీయాల్లో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవ‌కాశం ఉంటుంది.

Birth Marks

మంచి ఆలోచనాపరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు. అణకువగల భార్య.. వినయం కలిగిన సంతానంతో వీరి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతూ వుంటుంది. ఇక మాడుకు ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే గ‌న‌క‌.. మంచి తెలివితేటలతో పాటు వాక్ చాతూర్యం ఉంటుంది. సమాజ హితాన్ని గురించి ఆలోచించే వీరు సంపాదనకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు. సంసారాన్ని.. సంతానాన్ని ప్రతి బంధకాలుగా భావించే వీరు వేదాంతిలా కనిపిస్తూ దేశ సంచారం చేయడాన్నే ధ్యేయంగా పెట్టుకుంటారు. మాడు భాగానికి ముందు వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే.. ప్రతి విషయంలోనూ కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా సరే తన మాట వినవలసిందే అనే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. వీరికి సంపాదనే కాదు.. సంతానమూ ఎక్కువే. ఇక స్త్రీల విషయానికి వస్తే తలపై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి.

దురుసుతనానికి.. నిదర్శనంగా వీరు కనిపిస్తారు. స‌హ‌జంగా ఎవరి ముఖమైనా చూడగానే మొదట నొసలు కనబడతాయి. ఈ నొసలు సువిశాలంగా ఉన్న వ్యక్తిని మంచి ఆలోచనాపరుడిగా గుర్తించ‌వ‌చ్చు. అటువంటి నుదుటి భాగాన మచ్చ ఉన్న పురుషుడు పది మందిలోనూ మంచి వాడనిపించుకుంటాడు. పరోపకారి అవుతాడు. అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది. సువాసన ద్రవ్యముల పట్ల ఆసక్తిని కలిగి ఉండి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలవాడై వుంటాడు. ఇక కుడి కనుబొమ మీద మచ్చ ఉంటే వివాహం తొంద‌ర‌గానే అవుతుంది. సుగుణశీలిగ‌ల‌ భార్య లభిస్తుంది. భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు. ఈ పురుషుడు శాంత స్వభావంను కలిగి ఉంటాడు. కుడి కంటి లోపల మచ్చ ఉండినట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు. కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే.. వ్య‌క్తి సంపదలను కలిగి ఉంటాడు.

మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగానే చెప్ప‌వ‌చ్చు. వ్య‌క్తి స్వ‌భావాలు, జాత‌కం చెప్పాలంటే శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనే విష‌యం కూడా చాలా ముఖ్య‌మే. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగాను, ఆకుపచ్చగాను, తేనెరంగుగాను, పసుపుపచ్చగాను, గంధపు రంగుగా ఉంటాయి. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి. అయితే నలుపు రంగు దరిద్రమునకు, మరికొన్ని అశుభాలకు సూచికములని పెద్దలు అంటున్నారు. అయితే లేత నలుపు, ఆకుపచ్చరంగు, గంధపురంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభఫలితాలుంటాయి. అలాగే పుట్టు మచ్చల మీద వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అవి కొంచెము పొడవు కలిగి ఉంటే గ‌న‌క‌ ఆ వ్యక్తి ధనవంతుడు, కీర్తివంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెం పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు క‌లుగుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM