Calcium : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారం కావాలి. పోషకాలు ఒక్కొక్కటీ ఒక్కో రకమైన ప్రయోజనాలను మనకు అందిస్తాయి. ఈ క్రమంలోనే వాటిల్లో కాల్షియం చెప్పుకోదగిన పాత్ర పోషిస్తుంది. ఇది ఎముకలను బలంగా మార్చడమే కాదు, కిడ్నీ స్టోన్లు రాకుండా చూస్తుంది. కనుక కాల్షియాన్ని కూడా మనం తీసుకోవాల్సిందే. అయితే కాల్షియం కోసం చాలా మంది పాలు మాత్రమే తాగాలని అనుకుంటారు. కానీ పాలను తాగలేని వారు మరి కాల్షియం ఎలా పొందుతారు, అందుకోసం ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. పాలను తాగలేని వారు ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే చాలు, దాంతో కాల్షియం లభిస్తుంది. ఎముకలు బలంగా ఉంటాయి. ఇక కాల్షియం కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలలో కన్నా కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో బాదంపప్పు ఒకటి. గుప్పెడు బాదంపప్పును తింటే సుమారుగా 76 మిల్లీగ్రాముల వరకు కాల్షియం పొందవచ్చు. అలాగే అంజీర్ పండ్లలోనూ కాల్షియం అధికంగానే ఉంటుంది. 100 గ్రాముల అంజీర్ పండ్లను తింటే సుమారుగా 55 మిల్లీగ్రాముల వరకు కాల్షియం పొందవచ్చు. ఇక 100 గ్రాముల ఖర్జూరాలను తింటే 64 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.
100 గ్రాముల చియా విత్తనాలను తింటే 631 మిల్లీగ్రాముల వరకు కాల్షియం పొందవచ్చు. దీంతోపాటు కాల్షియాన్ని అందించడంలో నువ్వులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. 100 గ్రాముల నువ్వులను తినడం ద్వారా 989 మిల్లీగ్రాముల మేర కాల్షియం లభిస్తుంది. పాల కన్నా వీటిల్లో కాల్షియం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే కాల్షియాన్ని పొందవచ్చు. అలాగే గుప్పెడు జీడిపప్పును తినడం వల్ల సుమారుగా 57 మిల్లీగ్రాముల మేర కాల్షియం లభిస్తుంది. ఇక వాల్‌నట్స్‌ను 100 గ్రాముల మేర తింటే 98 మిల్లీగ్రాముల వరకు కాల్షియాన్ని పొందవచ్చు. ఇలా పాలను తాగలేని వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియాన్ని పుష్కలంగా పొందవచ్చు. దీంతో ఎముకలు బలంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…