Weight Loss : ఇలా చేస్తే చాలు.. నెల‌లోనే ఏకంగా 5 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

July 31, 2023 9:28 PM

Weight Loss : అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఈ విధంగా పాటిస్తే క‌చ్చితంగా నెల రోజుల్లో 5 కేజీల బరువు తగ్గొచ్చు. బరువు తగ్గడానికి చాలామంది తిండి మానేస్తుంటారు. అనేక రకాల మెడిసిన్స్ ని కూడా వాడుతూ ఉంటారు. వర్క్ అవుట్ చేయడం, వాకింగ్ వంటివి చేయడం ఇలా ఎన్నో రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు.

కొంతమంది బరువు తగ్గే క్రమంలో అనవసరంగా వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటారు. నడుము నొప్పి రావడం, కాళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇలా ఏదో ఒకటి వచ్చి బాధపడుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వాళ్ళు వీటిని కచ్చితంగా పాటించండి. అప్పుడు బరువు తగ్గొచ్చు. పైగా ఇలాంటి సమస్యలు ఏమీ కూడా మీకు ఎదురవ్వవు. చాలామంది ఏం చేస్తారంటే బరువు తగ్గాలని అనుకుని మొదట చాలా వేగంగా వర్క్ అవుట్స్ ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మొదట నెమ్మదిగా మొదలు పెట్టాలి.

if you are trying to Weight Loss follow these tips
Weight Loss

మొదట నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగంగా మీరు వెళ్లండి. స్ట్రెచింగ్ అనేది చాలా ముఖ్యం. చేతులు, కాళ్లు ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఉండండి. యోగా వంటి వాటి కోసం సమయాన్ని వెచ్చించండి. వ్యాయామం చేసినప్పుడు వార్మప్ చేయడం కూడా చాలా ముఖ్యం. రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదట మూడు నిమిషాలు మీరు నడవండి. ఆ తర్వాత జాగింగ్ చేయండి.

ఆ తరవాత వెంటనే కూర్చోకూడదు. నెమ్మదిగా నడవడం, ఆ తర్వాత ఆపడం ఇటువంటివి కచ్చితంగా పాటించాలి. బరువు తగ్గడానికి రన్నింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రన్నింగ్ వలన క్యాలరీలు ఎక్కువగా కరుగుతాయి. కాబట్టి వీలైనంతవరకు రోజూ రన్నింగ్ కోసం సమయాన్ని వెచ్చించండి. అయితే మీరు ఇక్కడ బరువు తగ్గాలనుకున్నప్పుడు తిండి మానేయడం మంచిది కాదు. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వంటివి తీసుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment