Idli And Dosa : బరువు తగ్గాలని రాత్రి ఇడ్లీ, దోస తింటున్నారా..? అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి..!

October 7, 2023 9:37 PM

Idli And Dosa : ఈరోజుల్లో చాలామంది, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బరువు తగ్గడం కోసం, చాలా ప్రయత్నాలు చేయాలి. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాలు పడితే, ఆ ఆహార పదార్దాలని తీసుకోకూడదు. అయితే, రోజూ రాత్రి పూట చాలామంది తక్కువ తినడం, లేదంటే అసలు ఆహారం తీసుకోకుండా ఉండిపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. రాత్రిపూట కొంతమంది బరువు తగ్గాలని ఇడ్లీ, దోస వంటివి కూడా తింటూ ఉంటారు.

రాత్రిపూట మీరు కూడా బరువు తగ్గాలని ఇడ్లీ, దోస వంటివి తింటున్నారా..?, అయితే, కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకుంటే, ఆరోగ్యానికి మంచిది. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇటువంటి ఆహార పదార్థాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. అయితే, ఉదయం పూట వీటిని తీసుకుంటే మంచిది. రాత్రిపూట మాత్రం తీసుకోవడం మంచిది కాదు. రాత్రిపూట పులియపబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

if you are taking Idli And Dosa at night then know these
Idli And Dosa

గర్భిణీలు, పాలిచ్చే వారు కూడా రాత్రిపూట పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో, కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. పెరుగు, పన్నీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాలిచ్చే తల్లులు కూడా వీటికి దూరంగా ఉండాలి. తల్లులకు కనుక కడుపునొప్పి వచ్చింది అంటే, పిల్లలకు కూడా వచ్చేస్తుంది. పులియపెట్టిన ఆహార పదార్థాలలో ఉప్పు కూడా ఎక్కువ ఉంటుంది. రక్తపోటు ఉన్నవాళ్లు, వీటికి దూరంగా ఉండటమే మంచిది.

కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. అలాంటి వారు కూడా, రాత్రి పూట ఇటువంటివి తీసుకోకూడదు. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు కూడా, రాత్రి పూట ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. యాసిడిటీ, కడుపు ఉబ్బరం వంటివి కలుగుతాయి. ఇడ్లీ, దోస తీసుకుంటే కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు కలగొచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు ఇడ్లీ, దోస వంటివి రాత్రి తీసుకోవద్దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment