ఆరోగ్యం

Corn Flakes : కార్న్ ఫ్లేక్స్‌ను త‌ర‌చూ తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

Corn Flakes : నేడు మనం గడుపుతున్నది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి పనిని మనం వేగంగానే పూర్తి చేస్తాం. త్వర త్వరగా పనులు పూర్తి కావాలని కోరుకుంటాం. ఇక ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ కూడా అంతే. చాలా త్వరగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుంటే.. వేగంగా తిని.. వెంటనే పనిలోకి దిగవచ్చు కదా.. అని చాలా మంది భావిస్తారు. అలాంటి వారు వేగంగా ప్రిపేర్ అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లనే రోజూ తింటుంటారు. అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లలో కార్న్ ఫ్లేక్స్ కూడా ఒకటి.

కార్న్‌ఫ్లేక్స్ కొన్ని తీసుకుని వాటిల్లో కొన్ని పాలు పోసి ఉదయాన్నే లాగించడం చాలా మందికి అలవాటు. ఇక కొందరు ఈ మిశ్రమంలో పాలతోపాటు తేనె, చక్కెర లాంటి పదార్థాలను రుచి కోసం కలుపుకుంటారు. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి మంచివేనా..? అంటే కాదు.. అనే సమాధానం వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. కార్న్ ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కాదు. అది ఎందుకో తెలుసుకోండి.

Corn Flakes

కార్న్ ఫ్లేక్స్‌లో కార్న్ (మొక్కజొన్న), షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తదితర పదార్థాలుంటాయి. నిజానికి ఇవన్నీ హై గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. అంటే.. ఇవి మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయన్నమాట. దీంతో ఇన్సులిన్ పెద్ద ఎత్తున విడుదలవుతుంది. అందువల్ల మెదడు కొంత సేపు ఇనాక్టివ్ అయిపోతుంది. చురుగ్గా ఉండలేరు. దీనికి తోడు కార్న్ ఫ్లేక్స్‌ను తినడం డయాబెటిస్ పేషెంట్లకు ఎంత మాత్రం మంచిది కాదు. రక్తంలో షుగర్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి.

ఫ్యాట్, చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. కార్న్ ఫ్లేక్స్ తయారీలో వాడే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మన శరీరానికి మంచిది కాదు. అందులో సాధారణ పిండిపదార్థాలు ఉంటాయి. కెమికల్ స్వీట్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని కలిగిస్తాయి. అధిక బరువు సమస్యను తెచ్చి పెడతాయి. దీనికి తోడు దంత క్షయం, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక కార్న్‌ఫ్లేక్స్‌ను తినకపోవడమే మంచిది. ఈ విషయాన్ని సాక్షాత్తూ వైద్య నిపుణులే చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM