Holy Basil Leaves For Diabetes : షుగర్ ఉన్నవాళ్ళకి ఈ మొక్క వరం.. ఈ సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి..!

December 6, 2023 11:46 AM

Holy Basil Leaves For Diabetes : చాలా మంది ఈ రోజుల్లో, షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ వలన రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. షుగర్ రాకుండా జాగ్రత్త పడటం అవసరం. షుగర్ వచ్చిన తర్వాత డాక్టర్ల సలహా తీసుకొని, కంట్రోల్ లో ఉంచుకోవాలి. అయితే, షుగర్ పేషంట్లకి ఈ మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీని గురించి ఈరోజు మనం చూద్దాం. తులసికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయుర్వేద మందుల్లో కూడా తులసిని వాడుతూ ఉంటారు.

తులసి మొక్క ఎవరింట్లో ఉంటే, వారికి మంచి జరుగుతుంది. పైగా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అంటారు. లేత రంగులో ఉంటే రామ తులసి అంటారు. తులసి ఆకు, తులసి నీరుతో అనేక లాభాలు పొందవచ్చు. తలనొప్పి, ఉదర సంబంధిత సమస్యలు తులసి తో తొలగిపోతాయి. అలానే, గుండె జబ్బులు, మలేరియా వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

Holy Basil Leaves For Diabetes take daily for many benefits
Holy Basil Leaves For Diabetes

కొవ్వు పదార్థాలు పేరుకుపోకుండా, తులసి చూస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా తులసి పెంపొందిస్తుంది. తులసిని తీసుకోవడం వలన, విటమిన్ ఏ తో పాటుగా ఫైబర్ కూడా అందుతుంది. తులసిని చాలా ఏళ్లగా స్వీట్నర్ కింద వాడడం జరుగుతోంది. తులసి తో బరువు కూడా తగ్గచ్చు.

అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు, తులసిని తీసుకుంటే బరువు తగ్గొచ్చు. కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండవు. డయాబెటిస్ ఉన్నవాళ్లు తులసిని తీసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. తీపి తులసి చక్కగా సహాయం చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు, తీపి తులసిని తీసుకోవడం వలన అందులో ఉండే బ్యాక్టీరియా లక్షణాలు కారణంగా, వివిధ రకాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు. దానితో పాటు కడుపునొప్పి వంటివి తగ్గిపోతాయి. పైగా బరువు తగ్గడం వంటివి కూడా జరుగుతాయి. ఇలా తీపి తులసితో అనేక లాభాలను పొందడానికి అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now