ఆరోగ్యం

Heart Health Foods : దీన్ని తాగితే చాలు.. హార్ట్ ఎటాక్ అస‌లే రాదు..!

Heart Health Foods : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. హార్ట్ బ్లాక్స్, గుండెపోటు, ర‌క్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజ‌రాయిడ్స్ పెర‌గ‌డం ఇలా అనేక ర‌కాల గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న‌విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌కపోవ‌డం, ఒత్తిడి, కూర్చుని ప‌ని చేయ‌డం, నూనెలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఇలా హార్ట్ బ్లాక్స్ స‌మస్య‌తో బాధ‌ప‌డే వారు, ర‌క్తంలో ట్రైగ్లిజ‌రాయిడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు ఇప్పుడు చెప్పే డైట్ ప‌ద్ద‌తిని పాటించ‌డం వ‌ల్ల హార్ట్ బ్లాక్స్ స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు మ‌ర‌లా రాకుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్ ను పాటించ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు కూడా త‌గ్గుతుంది.

కొలెస్ట్రాల్, ట్రైగ్లిజ‌రాయిడ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ను తగ్గించ‌డంతో పాటు గుండె స‌మ‌స్య‌లు రాకుండా చేసే డైట్ ప‌ద్ద‌తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉద‌యం నిద్ర‌లేవ‌గానే లీట‌ర్ నీటిని తాగి సుఖ విరోచ‌నం అయ్యేలా చూసుకోవాలి. ఒక గంట త‌రువాత మ‌ర‌లా లీట‌ర్ నీటిని తాగి మ‌రోసారి విరోచ‌నానికి వెళ్లాలి. ఇలా రెండు సార్లు విరోచ‌నం అయ్యాక వ్యాయామం చేయాలి. రోజూ ఉద‌యం 9 నుండి 9. 30 గంట‌ల వ‌రకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా నీటిని తాగుతూ వ్యాయామం చేస్తూ ఉండాలి. త‌రువాత నీటిలో మున‌గాకు పొడిని వేసి క‌షాయంలా త‌యారు చేసుకోవాలి. ఈ క‌షాయాన్ని వ‌డ‌క‌ట్టి తాగాలి.

Heart Health Foods

రోజూ ఒక పెద్ద క‌ప్పు మున‌గాకు క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల హార్ట్ బ్లాక్స్ త‌గ్గుతాయి. మున‌గాకు పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల 86శాతం హార్ట్ బ్లాక్స్ త‌గ్గుతున్నాయ‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్లడించారు. ఇలా మున‌గాకు క‌షాయాన్ని తాగిన త‌రువాత 10. 30 స‌మ‌యంలో వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. క్యారెట్, బీట్ రూట్, కొత్తిమీర లేదా పుదీనా వేసి 300 ఎమ్ ఎల్ జ్యూస్ చేసి తీసుకోవాలి. ఇక 12 గంట‌ల‌కు మొల‌కెత్తిన విత్త‌నాల‌కు క్యారెట్ తురుము, కీర‌దోస ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, క్యాప్సికం ముక్క‌లు, ఉల్లిపాయ ముక్క‌లు క‌లిపి తీసుకోవాలి. ఇది తీసుకున్న త‌రువాత మ‌న‌కు న‌చ్చిన పండ్ల‌ను ఆహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న త‌రువాత సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు నీటిని తాగుతూ ఉండాలి. సాయంత్రం ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. అలాగే సాయంత్రం 6 గంట‌ల లోపు ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో ఉడికించిన ఆహారాలు కాకుండా వాల్ నట్స్, బాదం ప‌ప్పు, గుమ్మ‌డి గింజ‌లు, పొద్దు తిరుగుడు గింజ‌లు వంటి వాటిని నాన‌బెట్టి తీసుకోవాలి. వీటికి తోడుగా అంజీర్, ఎండుద్రాక్ష వంటి వాటిని తీసుకోవాలి. వీటితో పాటు పండ్ల ముక్క‌ల‌ను ఆహారంగా తీసుకోవాలి.

ఇలా స‌హ‌జ సిద్ద ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కార్బోహైడ్రేట్స్ కూడా శ‌రీరంలోకి ఎక్కువ‌గా వెళ్ల‌కుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త‌నాళాలు మృదువుగా త‌యార‌వుతాయి. బీపీ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ర‌క్తం ప‌లుచ‌గా త‌యార‌వుతుంది. హార్ట్ బ్లాక్స్ క్ర‌మంగా త‌గ్గుతాయి. గుండె స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే ఈ విధంగా డైట్ ను పాటించ‌డం వ‌ల్ల తిరిగి గుండె ఆరోగ్యంగా త‌యార‌వుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ డైట్ ను వారంలో 2 లేదా 3 సార్లు లేదా మ‌న‌కు న‌చ్చిన‌న్ని సార్లు చేయ‌వ‌చ్చ‌ని ముఖ్యంగా మ‌న ఆరోగ్యాన్ని, మ‌న శ‌రీర అవ‌స‌రాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM