Healthy Juice : ఉప్పు, నూనె, నాన్ వెజ్‌.. వీటిని అధికంగా తింటున్న వారు ఈ జ్యూస్‌ను తాగాల్సిందే..!

August 15, 2023 7:33 PM

Healthy Juice : ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. చిన్న చిన్న చిట్కాలని మనం ట్రై చేస్తే కచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. పండ్లు తీసుకోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అందుకే అందరూ పండ్లు, పండ్ల రసాలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. అయితే పండ్ల రసాలు, పండ్లు కొనుగోలు చేయాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాలి.

అయితే తక్కువ డబ్బుతో మనం ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు..?, రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు..? అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తీసుకోవడం వలన ఖర్చు తక్కువ, ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రసాన్ని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. పండ్ల రసాల‌ లాగే మనం ప్రయోజనాలు పొందవచ్చు. 20 రూపాయల లోగా మనం ఈ రసాన్ని తయారు చేసుకోవచ్చు.

Healthy Juice take this daily for better health and immunity
Healthy Juice

కీర దోసకాయల‌ను ముక్కలుగా చేసుకుని టమాటాలని కూడా ముక్కలుగా చేసుకొని ఈ రెండింటినీ మిక్సీలో వేసి బాగా నలిగిన తర్వాత, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బీట్‌రూట్ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పుదీనా లేదంటే కొత్తిమీర రుచి కోసం వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకోవచ్చు.

ఇలా వీటి అన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. పిల్లలకి 150 ml వరకు పట్టించొచ్చు. ఇలా తీసుకోవడం వలన బ్లడ్ బాగా తయారవుతుంది. బాడీకి యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అవసరం. కాబట్టి, ఈ జ్యూస్ ని మీరు ఇలా తయారు చేసుకొని తీసుకోండి. కాఫీ, టీ వంటివి కాకుండా మీరు ఈ జ్యూస్ ని తీసుకుంటే, రోగ‌నిరోధక శక్తి పెరుగుతుంది. పోషకాలు బాగా అందుతాయి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment