చాలామంది గోధుమ వర్ణంలో ఉండే తేనెను చూసి ఉంటారు. కానీ తెలుపు రంగులో కూడా తేనే ఉంటుందని చాలామందికి తెలియదు.అయితే తెలుపు రంగులో ఉండే తేనె చూస్తే చాలా మంది అది సహజ సిద్ధమైనది కాదని భావిస్తారు. నిజానికి తెలుపు రంగులో కూడా తేనె ఉంటుంది. ఈ విధంగా తెలుపు రంగులో ఉన్నటువంటి తేనెను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధమైనటువంటి తెల్ల తేనెను ముడి తేనే అని కూడా అంటారు. మరి ఈ తెల్లటి తేనె వల్ల కలిగే లాభాలు ఏమిటి? తెల్ల తేనే తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులకు దూరంగా ఉండవచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలుపు రంగులో ఉన్నటువంటి తేనెలో మెగ్నీషియం, భాస్వరం, జింక్ లతో విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ తెల్ల తేనెను హౌస్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంవల్ల వీటిని ఈ విధంగా హౌస్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్ అని పిలుస్తారు. ఈ విధమైనటువంటి తెల్ల తేనెను ఉపయోగించి దగ్గు, గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.
ప్రస్తుతం వాతావరణంలో మార్పులు కారణంగా చాలా మంది దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలోకి టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెను తాగటం వల్ల నోటిలో ఏర్పడే నోటి పుండ్లు, నోటి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…