Ginger Juice : ఈ సీజ‌న్‌లో రోజూ ప‌ర‌గ‌డుపునే 1 టీస్పూన్ అల్లం ర‌సం తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

December 3, 2023 6:48 PM

Ginger Juice : అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు అల్లం వాడడం వలన, ఎన్నో లాభాలు ఉంటాయి. పైగా, పోషకాలు కూడా, అల్లం లో ఎక్కువ ఉంటాయి. అల్లం సీజనల్ గా వచ్చే సమస్యల్ని సులభంగా తగ్గిస్తుంది. ప్రతిరోజు, ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో, అల్లం రసం కలుపుకుని తాగితే, అద్భుతమైన లాభాలు పొందడానికి అవుతుంది. అల్లం రసం తీసుకుంటే, ఎటువంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు..? ఏఏ బాధల నుండి దూరంగా ఉండవచ్చు..? వంటి విషయాలను చూద్దాం.

అల్లంని శుభ్రంగా కడిగి, తొక్క తీసేసి, చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ ని పలుచని క్లాత్ సహాయంతో వడకట్టి, సీసాలో స్టోర్ చేసుకోండి. దీనిని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే, నాలుగు రోజులు పాటు నిల్వ ఉంటుంది. అల్లం రసం తీసుకోవడం వలన, అల్లం లో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి.

Ginger Juice take on empty stomach in this season
Ginger Juice

ఉదర సంబంధిత సమస్యల్ని కూడా అల్లం దూరం చేయగలదు. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్లు, ప్రతిరోజూ అల్లం రసం తీసుకోవడం వలన, నొప్పుల నుండి త్వరగా రిలీఫ్ కలుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది.

సీజనల్ వ్యాధులకి కారణమైన బ్యాక్టీరియాని నివారించి, గొంతుకు సంబంధించిన సమస్యలు లేకుండా చూస్తుంది. అలానే, అల్లం అనేక రకాల నొప్పులని తగ్గిస్తుంది. అల్లం రక్తం ని పల్చగా మార్చి, రక్త ప్రవాహాన్ని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. హృదయ సంబంధిత సమస్యలు లేకుండా చూస్తుంది. చర్మ సమస్యలు కూడా లేకుండా చూస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now