ఆరోగ్యం

Fruits For Weight Loss : ఈ పండ్ల‌ను రోజూ తింటే చాలు.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది.. బ‌రువు త‌గ్గుతారు..!

Fruits For Weight Loss : చాలా మంది బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. కొంద‌రు జిమ్‌ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి వ్యాయామం చేస్తారు. కొంద‌రు రోజూ వాకింగ్‌, యోగా, స్విమ్మింగ్ వంటివి చేస్తుంటారు. అయితే బ‌రువు త‌గ్గేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఇవ‌న్నీ అవ‌స‌ర‌మే. అయిన‌ప్ప‌టికీ ఇవే కాదు.. మ‌నం తీసుకునే ఆహారం విష‌యంలోనూ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే. ముఖ్యంగా కొన్ని ర‌కాల పండ్ల‌ను మ‌నం రోజూ తిన‌డం వ‌ల్ల కొవ్వు క‌రుగుతుంది. పొట్ట‌, తొడ‌ల ద‌గ్గ‌ర ఉండే కొవ్వు ఇట్టే క‌రిగి సుల‌భంగా బ‌రువు త‌గ్గుతారు. ఇక బ‌రువు త‌గ్గాలంటే రోజూ తినాల్సిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో బెర్రీ పండ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ప్‌బెర్రీలు.. ఈ కోవ‌కు చెందుతాయి. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగానే ఉంటాయి. ఇవన్నీ వాపుల‌ను త‌గ్గిస్తాయి. ముఖ్యంగా కొవ్వును క‌రిగిస్తాయి. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు రోజూ ఈ బెర్రీ పండ్ల‌ను తింటుండాలి. దీంతో త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. అలాగే గ్రేప్ ఫ్రూట్ కూడా కొవ్వును క‌రిగించ‌గ‌ల‌దు. ఈ పండ్ల‌లో అధికంగా నీరు ఉంటుంది. అందువ‌ల్ల కాస్త తిన‌గానే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఆక‌లి త్వ‌ర‌గా వేయ‌దు. ఫ‌లితంగా ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు త‌ప్ప‌నిస‌రిగా గ్రేప్ ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

Fruits For Weight Loss

రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ వద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని అంటారు. అలాగే ఈ పండును రోజూ ఒక‌టి తిన‌డం ద్వారా కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది. ఇందులో ఉండే ఫైబ‌ర్ కొవ్వును క‌రిగించేందుకు స‌హాయ ప‌డుతుంది. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. క‌నుక యాపిల్స్‌ను కూడా రోజూ తినాలి. అవకాడో పండ్ల‌లో మ‌న శ‌రీరానికి మేలు చేసే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవి అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తాయి. క‌నుక అవ‌కాడోల‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.

నారింజ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది స‌హ‌జ‌సిద్ధ‌మైన శ‌క్తిని అందిస్తుంది. అలాగే బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది. రోజూ నారింజ పండ్ల‌ను తింటుంటే త‌ప్ప‌కుండా బ‌రువు త‌గ్గుతారు. కివీ పండ్ల‌లో పోష‌కాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా, ఫైబర్ ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక కివీ పండ్ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అది కొవ్వుగా మార‌దు. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక కివీ పండ్ల‌ను కూడా రోజుకు ఒక‌టి చొప్పున తింటే మేలు జ‌రుగుతుంది.

పుచ్చ‌కాయ‌లు మ‌న‌కు కేవ‌లం వేస‌విలోనే కాదు.. ఇత‌ర సీజన్ల‌లోనూ అందుబాటులో ఉంటాయి. క‌నుక వీటిని త‌ర‌చూ తినాలి. వీటిల్లో నీరు, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. క‌నుక కొంత తిన్నా చాలు.. క‌డుపు నిండిపోతుంది. ఇది బ‌రువు త‌గ్గేందుకు ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. ఇలా ప‌లు పండ్ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు.. పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. దీంతో పోష‌కాహార లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక ఇవే కాకుండా ఫైబ‌ర్ ఎక్కువగా ఉండే ఇత‌ర ఏ ఆహారాలు అయినా స‌రే బ‌రువు త‌గ్గేందుకు స‌హ‌క‌రిస్తాయి. క‌నుక వాటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనుకున్న ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM