ఆరోగ్యం

Health : ఈ 4 చిన్నపాటి నియమాల‌ను పాటిస్తే.. 124 రోగాల నుండి మనల్ని మనం రక్షించుకోవ‌చ్చు..!

Health : ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి జీవిత సత్యం. ఇప్పుడిప్పుడే చాలా మందికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. ఇప్పుడు చెప్పబోయే 4 నియమాల‌ను క్రమం తప్పకుండా పాటిస్తే చాలు.. దాదాపు 124 రోగాలను మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవ‌చ్చు. ఈ 4 నియమాలు మనం తాగే నీటికి సంబంధించినవి కావడం విశేషం. అవేంటో ఇప్పుడోసారి చూద్దాం. తినడానికి 40 నిమిషాల ముందు తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్లు తాగొద్దు.

బ్రేక్ ఫాస్ట్, లంచ్ , డిన్నర్. ఏదైనా ఆహారం తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్లను ముట్టొద్దు. ఎందుకంటే మనం తిన్న ఆహారం పొట్టలోని ఈసోపేగస్ ‌లోకి వెళతాయి. అక్కడ హైడ్రాలిక్‌ యాసిడ్‌ సూక్ష్మక్రిములను చంపేసి, కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు‌ చేస్తుంది. తక్కువ PH విలువ కలిగిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంజైమ్ లకు ఉపయోగపడి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. త‌ద్వారా శక్తి విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఆహారం తిన్నవెంటనే నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ నెమ్మదవుతుంది. నీరు అద‌నంగా వచ్చి చేరడం కారణంగా హైడ్రాలిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లు డైల్యూట్ అయిపోతాయి. కాబట్టి జీర్ణం తర్వాత వ్యర్థాలు అలాగే మిగిలిపోతాయి. ఇవే అనేక రోగాలకు కారణం అవుతాయి. అందుకే తినడానికి 40 నిమిషాల ముందు తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్లు తాగొద్దు.

Health

నీళ్లను ఎప్పుడూ గటగటా తాగొద్దు. నీళ్లను ఒకేసారి గటగటా తాగకుండా టీ, కాఫీ తాగినట్టు సిప్ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల ప్రతి గుటక నీటితో నోటిలోని లాలాజలం కొంత మొత్తంలో శరీరంలోనికి పోతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. అలాకాకుండా నీటిని గటగటా తాగితే దాని మీద శరీరంలోని హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరపాల్సి వస్తుంది. ఈ సందర్భంలో అధిక ఎసిడిటీ కలుగుతుంది. ఇది రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నీళ్లను ఎప్పుడూ గటగటా తాగొద్దు. కూల్ వాటర్, ఐస్ వాటర్ తాగొద్దు. అతిగా కూల్ ఉన్న వాటర్ ను తాగొద్దు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే శరీరంలో ప్రతి సమయంలో ఏదో ఒక క్రియ జరిగి బాడీ అంతా వేడిగా ఉంటుంది.

ఈ సమయంలో కూల్ వాటర్ తాగితే రెండు పూర్తి వ్యతిరేక‌ టెంపరేచర్స్‌ బాడీ మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. తప్పదు అనుకుంటే కుండలో నీళ్లు చాలా బెటర్. అంతేకానీ ఐస్ వాటర్ వద్దు. నిద్రలేవగానే 2-3 గ్లాసుల వాటర్ తాగాలి. ఇప్పుడిప్పుడే ఈ సూత్రాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. నిద్రలేవడంతోనే ఓ మూడు గ్లాసుల నీటిని తాగాలి. ఆ నీరు శరీరంలో పేరుకుకపోయిన వ్యర్థాన్నంతా మలవిసర్జన రూపంలో బయటికి పంపుతుంది. 3 నిమిషాల్లో విరేచ‌నం పూర్తయ్యేలా చేస్తుంది. ఒక్కసారికే శరీర వ్యర్థాలను విసర్జించిన వారికి రోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలా నీటితో ముడిపడి ఉన్న ఈ నాలుగు సూత్రాలను క్రమం తప్పకుండా పాటించండి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM