Flax Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ ఒక్క స్పూన్ తింటే ఏమ‌వుతుందో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

August 7, 2023 4:05 PM

Flax Seeds : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి, అనేక రకాల ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే, ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ గింజలను తీసుకుంటే, మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఇక ఈ గింజల ఉపయోగాలు చూసేద్దాం. అవిసె గింజలని చాలా మంది తీసుకోరు. నిజానికి అవిసె గింజల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

అవిసె గింజలు మన శరీరానికి ఒక ఔషధంలా పనిచేస్తాయి. అవిసె గింజల వలన ఎలాంటి రుగ్మతలు రాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ గింజలను తీసుకోవడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గింజల్ని తీసుకుంటే బరువు కంట్రోల్ లో ఉంటుంది. అవిసె గింజలను నూనె కూడా వాడొచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Flax Seeds health benefits take daily one spoon
Flax Seeds

క్యాన్సర్ వ్యాధిని నివారించేందుకు కూడా అవిసె గింజల నూనె ఉపయోగపడుతుంది. అవిసె గింజల్ని మనం డ్రై ఫ్రూట్ లడ్డు వంటివి తయారు చేసుకుని తీసుకోవచ్చు. లేదంటే పువ్వులతో కూర కూడా చేసుకుని తింటూ ఉంటారు. అవిసె గింజల్లో పీచు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగా మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. శారీరిక ఎదుగుదలకి, శిరోజాల ఆరోగ్యానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువ ఉండడం వలన మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.

అవిసె గింజల్ని మనం ఎలాగైనా తీసుకోవచ్చు. అవిసె గింజలతో పొడి చేసుకుని కూడా తీసుకోవచ్చు. అవిసె గింజల్ని తరచుగా తీసుకోవడం వలన వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరుని మెరుగు పరుస్తాయి. రోజూ ఈ గింజల్ని తీసుకోవడం వలన రక్తనాళాల లోపల కొవ్వు ఉండకుండా కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తుంది. హార్ట్ బ్లాక్స్ రాకుండా ఉండడానికి, ఒక వేళ వచ్చినా త్వరగా కరగడానికి అవిసె గింజలు పనిచేస్తాయి. ఇలా అవిసె గింజల్ని తీసుకోవడం వలన ఈ సమస్యలన్నిటికీ దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా గుండె సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment