Egg Yolk : గుడ్డు తినేట‌ప్పుడు ప‌చ్చ సొన ప‌డేస్తున్నారా.. ఇక‌పై అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

August 30, 2023 12:23 PM

Egg Yolk : ఆరోగ్యానికి గుడ్డు చాలా మేలు చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ గుడ్డును తీసుకుంటూ ఉంటారు. గుడ్డు వల్ల అనేక పోషకాలు మనకి అందుతాయి. దాంతో మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. గుడ్డులో ఉండే పోషకాలని పొందడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉండొచ్చు. అయితే గుడ్డులో ఉండే పసుపు సొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, మంచిది కాదని, కేవలం తెల్ల సొనని మాత్రమే తినాలని చాలా మంది అదే చేస్తూ ఉంటారు.

నిజానికి పసుపు సొనలో కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. గుడ్డులోని తెల్ల సొన, విటమిన్లు కంటే పచ్చ సొన‌లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. గుడ్ల ద్వారా ఏడు రకాల పోషకాలు మనకి అందుతాయి. విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ డి కూడా గుడ్డులో ఉంటాయి. అయితే పచ్చ సొనని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే.. శరీరం కండరాలని నిర్మించడానికి, శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది.

Egg Yolk do not throw it away know the benefits
Egg Yolk

పచ్చ సొనలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పచ్చ సొనలో 2.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మొత్తం గుడ్డు లో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటే, పచ్చ సొన లోనే చాలా శాతం ప్రోటీన్ ఉంటుంది. పచ్చ సొన లో 90 శాతం క్యాల్షియం ఉంటుంది. 93 శాతం ఐరన్ కూడా ఉంటుంది. తెల్ల సొన తో పోల్చి చూసుకున్నట్లయితే గుడ్డు పచ్చ సొన లోనే ఫోలేట్, విటమిన్ బి12 ఎక్కువగా ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. గుడ్డు లో వుండే పచ్చ సొనని తీసుకోవడం వలన వయసు సంబంధిత కంటి సమస్యలు రావు. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ లేదంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు గుడ్డు తీసుకునేటప్పుడు డాక్టర్ ని అడిగి తీసుకోవడం మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment