Dry Lips Home Remedies : చ‌లికాలంలో మీ పెద‌వులు ప‌గ‌ల‌కుండా మృదువుగా ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

October 24, 2023 6:15 PM

Dry Lips Home Remedies : చలికాలంలో చలి కారణంగా, అనేక ఇబ్బందులు వస్తుంటాయి. ముఖ్యంగా, కాళ్ళకి పగుళ్లు తో పాటుగా, పెదాలు పగిలిపోవడం, చర్మం డ్రై గా అయిపోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వింటర్ ఇప్పటికే మొదలైంది. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వింటర్ సీజన్ లో, చర్మ సమస్యలు, పెదాల పగుళ్లు వలన చాలా మంది విసిగిపోతుంటారు. పెదాల పగుళ్ల వల్ల తీవ్రమైన అసౌకర్యంతో పాటుగా నొప్పి కూడా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు పెదాలు బాగా పగిలిపోయి, రక్తం కూడా కారుతూ ఉంటుంది.

పెదాల పగుళ్లు ఏర్పడ్డాక, బాధపడడం కంటే కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వింటర్లో పెదాలు పగిలిపోకుండా, పెదాలు బాగుండాలంటే ఇలా చేయండి. ఈ ఇంటి చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ తీసుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు షియా బటర్ ని వేసుకోండి.

Dry Lips Home Remedies in telugu
Dry Lips Home Remedies

ఇప్పుడు, స్టవ్ ఆన్ చేసి, గిన్నె పెట్టుకుని, అందులో నీళ్లు వేసి మరిగించుకోండి. మరిగిన వాటర్ లో షియా బటర్ వేసిన గిన్నె ని పెట్టి కరిగించుకోండి. ఇప్పుడు మెల్ట్ అయిన బటర్ లో, ఒక టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయండి.

రెండు చుక్కల వరకు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ని వేయండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని, అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోండి. రెండు గంటలపాటు వదిలేసి, ఆ తర్వాత పెదాలకి రాయండి. లిప్ బాం ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఈ లిప్ బామ్ ని బాగా రోజుకి రెండుసార్లు నుండి మూడు సార్లు వరకు అయినా రాసుకోవచ్చు. పెదాలు పొడి బారిపోకుండా అందంగా ఉంటాయి. ఎక్కువసేపు తేమని ఉంచుతుంది. వింటర్లో పెదాల పగుళ్ళతో బాధపడే వాళ్ళు, ఇలా సమస్య లేకుండా ఉండొచ్చు. పెదాలు మృదువుగా కూడా మారతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now