ఆరోగ్యం

Drinking Alcohol : రోజూ 90 ఎంఎల్‌ మద్యం సేవిస్తే ఏమవుతుంది.. తెలుసుకోకపోతే నష్టపోతారు..!

Drinking Alcohol : మద్యం సేవించడం అనేది నేటి తరుణంలో చాలా మందికి ఫ్యాషన్‌ అయిపోయింది. రోజూ ఏదో ఒక కారణం చెప్పి మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవిస్తే మంచిదే కదా అని కూడా కొందరు అంటుంటారు. ఇక కొందరు మనస్సు బాగా లేదనో, ఒత్తిడి ఎక్కువగా ఉందనో, ఇతరత్రా సమస్యలు ఉన్నాయనో చెప్పి రోజూ మద్యం సేవిస్తుంటారు. అయితే వాస్తవానికి మద్యాన్ని ఎప్పుడో ఒకసారి ఒకటి లేదా రెండు పెగ్గులు సేవిస్తే మంచిదే అని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ దాన్ని రోజూ వ్యసనంగా తీసుకుంటుంటే మాత్రం అది ఆరోగ్యానికి ఎంతో కీడును కలిగిస్తుందని అంటున్నారు. రోజూ మద్యం సేవించడం వల్ల ఎన్ని అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది 90 ఎంఎల్‌ అని చెప్పి రోజూ మద్యం సేవిస్తుంటారు. అయితే అంత తక్కువ మోతాదులో అయినా సరే ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. కానీ రోజూ అయితే మాత్రం దుష్పరిణామాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ మద్యం సేవించడం వల్ల శరీరంపై ఒత్తిడి పడుతుంది. అది మానసికంగా కూడా ప్రభావం చూపిస్తుంది. మద్యం రోజూ సేవించడం వల్ల మెదడు కణాలు దెబ్బ తింటాయి. దీంతో మానసికంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. విసుగు, కోపం, చికాకు వంటివి వస్తాయి. ఎవరు చెప్పినా వినరు. మద్యానికి బానిసలుగా మారిపోతారు. అందుకోసం ఏం చేసేందుకైనా వెనుకాడరు. కనుక మద్యం రోజూ సేవించడం మానుకోవాలి.

Drinking Alcohol

రోజూ మందు తాగడం వల్ల లివర్‌కు ఎంతగానో నష్టం కలుగుతుంది. కిడ్నీలు చెడిపోతాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తుంది. అప్పుడు చేసేదేమీ ఉండదు. అలాగే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. డయాబెటిస్‌, గుండె జబ్బులు వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. గ్యాస్‌, అసిడిటీ సమస్యలు వస్తాయి. ఆహారం సరిగ్గా తినలేరు. తిన్నా వంటబట్టదు. శరీరం అంతా విషతుల్యంగా మారుతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తుంది.

రోజూ మద్యం సేవిస్తే కొంత కాలానికి చిన్నపాటి ధ్వనులను కూడా గుర్తించలేరు. వాసనశక్తి తగ్గిపోతుంది. చూపు స్పష్టంగా ఉండదు. శరీరం వణికినట్లు అవుతుంది. ఇన్ని అనర్థాలు పొంచి ఉంటాయి కనుక మద్యాన్ని రోజూ తాగరాదు. ఎప్పుడో ఒకసారి ఒకటి లేదా రెండు పెగ్గులు అయితే ఓకే. కానీ రోజూ సేవిస్తే అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకున్నవారు అవుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM