ఆరోగ్యం

Papaya : బొప్పాయి పండులో దాగి ఉన్న అద్భుతాలు ఇవే.. ఎవ‌రైనా స‌రే తినాలి..!

Papaya : మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే పండ్ల‌లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. ఇవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. బొప్పాయి పండ్లు అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. అంద‌రూ ఇష్టంగా వీటిని తింటారు. మ‌న‌కు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇవి ఇళ్ల‌లోనే విరివిగా పండుతాయి. అయితే ఏ సీజ‌న్ అయినా స‌రే బొప్పాయి పండ్ల‌ను తిన‌డం మ‌రిచిపోకూడ‌దు. ఆడ లేదా మ‌గ ఎవ‌రైనా స‌రే ఈ పండ్ల‌ను రోజూ త‌ప్ప‌కుండా తినాలి. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి పండ్ల‌లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. విట‌మిన్లు సి, ఎల‌తోపాటు ఫోలేట్‌, పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీర విధులు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. శ‌రీరాన్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్ల‌లో ప‌పైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లు సుల‌భంగా జీర్ణం చేసి మ‌న‌కు శ‌క్తిని అందిస్తుంది. అందువ‌ల్ల మాంసాహారం తిన్న‌ప్పుడు లేదా అతిగా తిన్న‌ప్పుడు బొప్పాయి పండ్ల‌ను తింటే ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. దీంతో అజీర్తి, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. అలాగే మ‌రుస‌టి రోజు సుఖ విరేచ‌నం అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం అనేది ఉండ‌దు.

Papaya

బొప్పాయి పండ్ల‌లో కెరోటినాయిడ్స్‌, ఫ్లేవ‌నాయిడ్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి కూడా యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. ఇవ‌న్నీ శ‌రీరంలోని హానిక‌ర ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. దీని వ‌ల్ల క‌ణాలు దెబ్బ తిన‌కుండా ఉంటాయి. దీంతో క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఈ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. అందువ‌ల్ల సీజ‌న్లు మారిన‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా బొప్పాయి పండ్ల‌ను తినాలి. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ముఖ్యంగా విష జ్వ‌రాలు రాకుండా ఉంటాయి.

బొప్పాయి పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఇది ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తుంది. దీంతో చ‌ర్మాన్ని సుర‌క్షితంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వ‌ల్ల చ‌ర్మానికి మేలు చేసే కొల్లాజెన్ ఉత్ప‌త్తి చేయ‌బ‌డుతుంది. ఇది చ‌ర్మానికి ఎంతో అవ‌స‌రం. దీంతో ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉంటారు. చ‌ర్మం కాంతివంతంగా మారి మెరిసిపోతుంది. వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు. బొప్పాయి పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్‌, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో హైబీపీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి.

బొప్పాయి పండ్ల‌లో ప‌పైన్‌, కైమోప‌పైన్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్షణాల‌ను క‌లిగి ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉండే వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. బొప్పాయి పండ్ల‌లో విట‌మిన్ ఎ, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి క‌ళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే శుక్లాలు రాకుండా చూస్తాయి. కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. బొప్పాయి పండ్ల‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ పండు బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. దీన్ని త‌క్కువ తిన్నా చాలు.. పొట్ట నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో బ‌రువు త‌గ్గ‌డం తేలిక‌వుతుంది. ఇలా బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక దీన్ని రోజూ మ‌రిచిపోకుండా తినండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM