ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. బరువు విషయంలో కూడా, ప్రతి ఒక్కరు జాగ్రత్త వహిస్తారు. బరువు ఎక్కువ వున్నా తక్కువ వున్నా కూడా ప్రమాదమే. కాబట్టి, సరైన బరువుని మైంటైన్ చేయండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, శరీర బరువుని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. బరువు పెరిగే కొద్దీ, అనేక రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. అయితే, వివిధ రకాల సమస్యల నుండి దూరంగా ఉండడానికి బరువు తగ్గడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బిస్కెట్లు లేదంటే కుకీలు వంటి బేకరీ వస్తువులు తినడం మంచిది కాదు.
అనారోగ్య కొవ్వులు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, చక్కెర వీటిలో ఉండడం వలన బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చాలామంది ఉదయం పూట కాఫీ, టీ తో పాటుగా బిస్కెట్లు తింటూ ఉంటారు. క్యాలరీలు అధికంగా ఉండడంతో పాటుగా, షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.పైగా, బరువు కూడా పెరిగిపోతారు.
ఉదయం పూట చాలామంది ఇళ్లల్లో పరోటాలను తింటూ ఉంటారు. కూరగాయలు, గోధుమ పిండితో చేసిన పరోటా ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిని బటర్, పచ్చళ్లతో తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. బరువు పెరిగిపోతారు. చిప్స్, వేయించిన స్నాక్స్. ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకుంటే కూడా ఈజీగా బరువు పెరిగిపోతారు. క్యాలరీలు వీటిలో ఎక్కువ ఉంటాయి. నూనెలో వేయించిన ఆహార పదార్థాలని కూడా ఉదయం పూట తినకూడదు.
పండ్లు, కూరగాయలు, గింజలు, పెరుగు వంటి ఆరోగ్యకరమైన వాటిని తీసుకోండి. ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్, పాప్ కార్న్, వెన్న వంటివి తీసుకోకండి. వీటి వలన కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపులో మంట కూడా కలుగుతుంది. బరువు తగ్గాలంటే పండ్లు తీసుకోండి. పండ్లు తీసుకోవడం వలన పోషకాలు కూడా బాగా అందుతాయి. బరువు కూడా తగ్గొచ్చు. ఇలా, వీటిని కనుక అనుసరించారు అంటే, ఆరోగ్యంగా ఉండొచ్చు. బరువు కూడా పెరిగిపోరు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…