Fruits : రాత్రిళ్ళు వీటిని అస్సలు తీసుకోవద్దు.. మీ ఆరోగ్యం పాడవుతుంది..!

July 18, 2023 11:08 AM

Fruits : అరటి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అరటి పండును తీసుకుంటే వెంటనే నీరసం మొత్తం తొలగి పోతుంది. వెంటనే ఎనర్జీ వస్తుంది. అందుకే క్రీడాకారులు అరటిపండుని తీసుకుంటూ ఉంటారు. అయితే రాత్రిపూట మాత్రం అరటి పండును తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి పూట అరటిపండును తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు. రాత్రిపూట అరటిపండు తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. కనుక రాత్రి పూట అరటి పండుని తీసుకోకుండా ఉండడమే మంచిది.

రాత్రిపూట ఆపిల్ తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. సపోటాని తీసుకుంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాత్రిళ్ళు సపోటా పండ్లని కూడా తీసుకోకూడదు. ఒకవేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి సపోటా పండ్లని కూడా రాత్రుళ్ళు తీసుకోవద్దు. రాత్రి పూట నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లు, బత్తాయి పండ్లు తీసుకోకూడదు. ఈ పండ్లను రాత్రి పూట తింటే కడుపులో గ్యాస్, ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

do no take these Fruits at night
Fruits

ఇలా ఈ పండ్ల వల్ల నష్టం కలుగుతుంది. కాబట్టి రాత్రి పూట వీటిని తీసుకోకండి. మీరే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రాత్రిపూట వీలైనంత త్వరగా ఆహారం తీసుకోవడం మంచిది. అదే విధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి దూరంగా ఉంటే మంచి నిద్రని పొందవచ్చు.

ఈ రోజుల్లో చాలా మంది ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం, ఎక్కువసేపు ఫోన్ లోనే ఉండడం వంటివి చేస్తున్నారు. కానీ అజీర్తి సమస్యలు మొదలు నిద్రలేని సమస్యల వరకు ఎన్నో రకాల సమస్యలు కలుగుతాయి. దాంతో మీ ఆరోగ్యం బాగా పాడవుతుంది. కాబట్టి అనవసరంగా ఇటువంటి పొరపాట్లని చేయకండి. ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి పడేసుకోకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment