Dates Powder For Sleep : రాత్రి పూట కంటినిండా నిద్ర ఉండ‌డం లేదా.. ఈ పొడి తీసుకుంటే చాలు, గాఢంగా నిద్ర ప‌డుతుంది..!

December 9, 2023 1:24 PM

Dates Powder For Sleep : చాలామంది, రాత్రిపూట నిద్రపట్టక బాధపడుతూ ఉంటారు. మీకు కూడా రాత్రి నిద్ర పట్టట్లేదా..? నిద్ర పట్టడానికి, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే, ఇలా చేయాల్సిందే. చాలామంది, ఈరోజుల్లో మానసిక ఆందోళన మొదలైన ఇబ్బందులకు గురవుతున్నారు. సో, రాత్రి పూట నిద్ర పట్టట్లేదు. రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు అని చాలామంది స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటున్నారు. కొంతమంది ఇంటి చిట్కాలు కూడా పాటిస్తున్నారు. నిద్ర పట్టని వాళ్ళు, ఇలా చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది.

ఈ చిట్కా మంచి నిద్రని అందిస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా. ఎండు ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండు ఖర్జూరంతో అనేక లాభాలని పొందవచ్చు. ఎండు ఖర్జూరాలని, 200 గ్రాములు తీసుకుని, ముక్కలు కింద కట్ చేసుకోవాలి.

Dates Powder For Sleep make like this for many benefits
Dates Powder For Sleep

అలానే, బాదం పప్పుల్ని కూడా 100 గ్రాములు తీసుకోండి. చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని, కట్ చేసుకున్న ఖర్జూరాలని, అలానే బాదం పప్పులు వేసుకోండి. 50 గ్రాములు గుమ్మడి గింజలు, గసగసాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని మీరు ఒక నెల రోజులు పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ముందు, ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో, ఒక స్పూన్ పొడి వేసుకుని తీసుకుంటే, నిద్ర బాగా పడుతుంది.

పైగా పోషకాలు కూడా బాగా అందుతాయి. బాదంపప్పులో ఉండే పదార్దాలు నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తాయి. గుమ్మడి గింజల్లో ఉండే అమైనో ఆమ్లం నిద్ర పట్టేటట్టు చేస్తుంది. గసగసాలు లో మెగ్నీషియం ఉంటుంది. నిద్రలేమి సమస్య ని ఇది దూరం చేస్తుంది. ఇలా నిద్ర పట్టడానికి ఈ పొడి మనకి బాగా హెల్ప్ చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now