Curd For Face : పెరుగును ఇలా వాడితే చాలు.. మీ ముఖాన్ని మీరే గుర్తు ప‌ట్ట‌లేరు..!

December 10, 2023 3:40 PM

Curd For Face : అందంగా కనపడడానికి, చాలామంది రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అలానే, మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కూడా వాడుతూ ఉంటారు. అందంగా కనపడాలని మీరు కూడా అనుకున్నట్లయితే, ఇలా చేయడం మంచిది. ఇలా చేస్తే, మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో జీవనశైలి మారిపోయింది. పైగా వాతావరణం లో కాలుష్యం కారణంగా అందం పాడవుతుంది. అలానే, కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని అధికంగా వాడడం వలన, ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు వంటివి ఏర్పడుతున్నాయి.

ఇటువంటి సమస్యలు ఏమి లేకుండా, అందంగా కనపడాలంటే, ఇంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. నిజానికి, ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ వారి అందాన్ని పెంపొందించుకోవడానికి మార్గాలు చూస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ని ఉపయోగించడం వలన నష్టాలు కలుగుతాయి. అలా కాకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది. సహజ సిద్ధమైన పదార్థాలతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఐదు స్పూన్లు పెరుగుని ఒక క్లాత్ లో వేసి, పెరుగునుండి నీటిని తొలగించాలి.

Curd For Face use in this way for beauty
Curd For Face

నీటిని వేరు చేసిన పెరుగులో ఒక స్పూన్ పంచదార కలిపి, స్క్రబ్ గా ఉపయోగించాలి. ఇలా స్క్రబ్ చేయడం వలన చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, మృత కణాలు అన్ని తొలగిపోతాయి. క్లీన్ గా ముఖం మారిపోతుంది. ఒక స్పూన్ పెరుగు లో పావు స్పూన్ పసుపు, అర స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించాలి.

రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, నీతితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మిగిలిన ఒక స్పూన్ పెరుగు లో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ గంధం పొడి, కొంచెం రోజు వాటర్ వేసి ముఖానికి పట్టించాలి. ఇది ఆరిపోయిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసేసుకోవాలి ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now