Coriander Leaves With Lemon : కొత్తిమీర, నిమ్మరసాన్ని రోజూ తీసుకోండి.. ఈ సమస్యలన్నీ పోతాయి..!

December 1, 2023 11:13 AM

Coriander Leaves With Lemon : కొత్తిమీర వంటల్లో వేస్తే, వంట రుచి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. కొత్తిమీర మంచి రుచిని, సువాసనని ఇస్తుంది. కొత్తిమీర తీసుకోవడం వలన, ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలానే, నిమ్మకాయలో కూడా పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. కొత్తిమీర నిమ్మకాయని కలిపి తీసుకుంటే, ప్రయోజనాలు రెట్టింపు పొందుతాయి. కొత్తిమీర జీవక్రియ రేటును పెంచుతుంది. నిమ్మరసంలో విటమిన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే, ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన, అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ డిటాక్స్ డ్రింక్ శరీరాన్ని, హైడ్రేట్ గా మారుస్తుంది.

రిఫ్రెష్ గా ఉంచుతుంది. అధిక బరువు సమస్యని పోగొడుతుంది. శరీరంలో, అదనంగా ఉన్న కొవ్వుని కరిగించడానికి కూడా, ఈ డ్రింక్ మనకి సహాయం చేస్తుంది. శరీరాన్ని సహజంగా నిర్వికరణ చేయడానికి ఉపయోగపడుతుంది. శరీరం నుండి టాక్సిన్స్ ని కూడా, ఈ డ్రింక్ బయటకు పంపుతుంది. రాత్రిపూట, ఒక గ్లాసు నీళ్లలో కొన్ని కొత్తిమీర ఆకుల్ని, ఒక స్పూన్ నిమ్మరసాన్ని వేసి, రాత్రి అంతా అలా వదిలేయాలి.

Coriander Leaves With Lemon take daily for many benefits
Coriander Leaves With Lemon

మరుసటి రోజు ఉదయం, ఆ నీళ్ళని తాగాలి. లేదంటే, మీరు పొయ్యి మీద గిన్నె పెట్టి, ఒక గ్లాసు నీటిని పోసి, కొన్ని కొత్తిమీర ఆకుల్ని, ఐదు నిమిషాలు పాటు మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు, ఒక స్పూన్ నిమ్మరసం కలపండి. ఉదయాన్నే పరగడుపున, ఈ డ్రింక్ ని తీసుకోవాలి.

ఈ డ్రింక్ కాలేయాన్ని కూడా శుభ్రంగా మారుస్తుంది. ఈ డ్రింక్ ని రోజు విడిచి రోజు 15 రోజులు పాటు తాగడం మంచిది. 15 రోజుల తర్వాత, మళ్లీ 15 రోజులు తాగాలి. ఈ డ్రింక్ శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి, ఇన్ఫెక్షన్స్ ని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో పెట్టిన, ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ జ్యూస్ ని తాగితే, పోషకాలని గ్రహించడమే కాకుండా, కాలయాన్ని యాక్టివ్ గా చేసి టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది. సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now