ఆరోగ్యం

Constipation : మలబద్దకాన్ని సులభంగా దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి..?

Constipation : శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటికి పంపివేయాలి. లేదంటే అనారోగ్యాల పాలు కావల్సి వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే అలాంటి వ్యర్థాల్లో ప్రధానంగా చెప్పుకోదగినది మలం. మనలో అధిక శాతం మంది మలబద్దకంతోనో లేదా ఇతర కారణాలతోనే నిత్యం విరేచనం సరిగా చేయరు. దీంతో వివిధ జబ్బులకు గురి కావల్సి వస్తుంది. మనం సాధారణంగా రోజుకు 3 సార్లు భోజనం చేస్తాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలతో ముగిస్తాం. అయితే 3 సమయాల్లోనూ తప్పనిసరిగా మల విసర్జన చేయాల్సిందే. అధిక శాతం వరకు 3 సార్లు ఎవరూ వెళ్లరు. 2 సార్లు వెళ్లే వారు కూడా చాలా తక్కువగానే ఉంటారు. ఈ నేపథ్యంలోనే మల విసర్జన సాఫీగా జరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెస్టర్న్ తరహా మరుగుదొడ్లకు వెళ్లేవారు 90 డిగ్రీల కోణంలో సాధారణంగా కూర్చుంటారు. అయితే ఇది చాలా తప్పు. ఎందుకంటే మల విసర్జన సరిగా జరిగేందుకు ఇది ఏమాత్రం దోహదం చేయదు. ఆ తరహా మరుగుదొడ్డి ఉన్నా సరే బేసిన్‌పై 35 డిగ్రీల కోణం వచ్చేలా కూర్చోవాలి. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది. పీచు (ఫైబర్) ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రధానంగా బ్రకోలి, కాలిఫ్లవర్, క్యాబేజీ, ఆకుపచ్చని కూరగాయలు, యాపిల్స్, క్యారెట్లు, బెర్రీలు, నారింజ, నిమ్మ వంటి వాటితోపాటు సల్ఫర్ ఉండే గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ముల్లంగి వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

Constipation

రోజుకు సరాసరిగా ఒక వ్యక్తి దాదాపు 15 గ్రాముల ఫైబర్ ఉన్న ఆహార పదార్థాన్ని తింటాడు. అయితే మనకు కనీసం 25 గ్రాముల వరకు ఫైబర్ అవసరం అవుతుంది. ఎక్కువగా మలబద్దకంతో బాధపడే వారు ఫైబర్ ఉన్న పదార్థాలను తీసుకోవాలి. ఈ క్రమంలోనే వారికి గోధుమ పిండితో చేసిన రొట్టెలు, గోధుమ బ్రెడ్, నట్స్, ఆకుపచ్చని కూరగాయలు వంటివి మేలు చేస్తాయి. టాయిలెట్ సీట్‌పై కూర్చునే విధానంలో కూడా మల విసర్జన సాఫీగా జరగడం ఆధారపడి ఉంటుంది. సీట్‌పై గుంజీలు తీసినట్టు కూర్చోవాలి. అప్పుడే సరైన భంగిమ ఏర్పడి విరేచనం సులువుగా అవుతుంది. నీటిని ఎక్కువగా తాగాలి. తక్కువగా తాగితే అది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఫలితంగా మలబద్దకం సమస్య కూడా వస్తుంది. అందుకే నీరు ఎక్కువగా తాగితే విరేచనం కూడా సాఫీగా జరుగుతుంది.

కాఫీ తాగితే సులువుగా విరేచనం జరుగుతుందట. సో, రోజుకో కప్పు కాఫీ తాగితే మలబద్దకం సమస్య కూడా ఉండదు. నడకతో కూడా మల విసర్జన సాఫీగా జరిగేలా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా నడిస్తే అంత సులువుగా విరేచనం జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కూర్చోవడం మాని ఎక్కువగా నడవండి. పొట్టను సున్నితంగా మసాజ్ చేసినా విరేచనం సులువుగా జరుగుతుంది. ఇక ముందెప్పుడైనా విరేచనం సమస్యగా ఉంటే ఈ ట్రిక్‌ను ఫాలో అయి చూడండి. ఫలితం కనిపిస్తుంది. ప్రూన్స్ అనే ఓ రకమైన పండ్లలో అనేక రకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మల విసర్జన సాఫీగా, సులువుగా జరిగేలా చేస్తాయి. ఈ పండ్ల జ్యూస్‌ను తాగినా ఫలితం ఉంటుంది. ఇలా మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM