Cinnamon Water For Weight Loss : బరువు తగ్గాలని చూస్తున్నారా..? పెద్ద కష్టపడక్కర్లేదు.. ఈ డ్రింక్ రోజూ తాగితే చాలు..!

December 3, 2023 4:50 PM

Cinnamon Water For Weight Loss : సరైన బరువును మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. చాలా మంది, బరువు తక్కువగా ఉండడమో లేదంటే ఎక్కువగా ఉండడమే జరుగుతూ ఉంటుంది. కానీ, సరైన బరువును మెయింటైన్ చేయడం చాలా అవసరం. కొందరు అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే, ఇలా చేయండి. ఈ మధ్యకాలంలో, అధిక బరువు సమస్య చాలామందిలో ఎక్కువవుతోంది. అయితే, కొన్ని పదార్థాలతో బరువును తగ్గించుకోవచ్చు.

పసుపు బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వుని కరిగించడానికి కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే పదార్థాలు, కొవ్వు కణజాల పెరుగుదలని అడ్డుకుంటుంది. ప్రతిరోజు, ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళల్లో లేదా పాలల్లో చిటికెడు పసుపు పొడి వేసుకుని తాగితే మంచిది. త్రిఫల కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కొవ్వుని కరిగిస్తుంది.

Cinnamon Water For Weight Loss take daily for many benefits
Cinnamon Water For Weight Loss

అలానే, తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేటట్టు కూడా త్రిఫల చూస్తుంది. పేగు కదలికలని కూడా ప్రేరేపిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. బరువు తగ్గడానికి దాల్చిన చెక్క కూడా బాగా ఉపయోగపడుతుంది. జీవక్రియ రేటుని ఇది పెంచుతుంది.

బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి తాగితే కొవ్వు కణాలను విచ్చిన్నం చేసి బయటకు పంపుతుంది. అలానే, ప్రతిరోజు కూడా అరగంట పాటు వ్యాయామం చేయండి. వ్యాయామం చేస్తే కూడా బరువు తగ్గడానికి అవుతుంది. ఎప్పుడూ కూడా బరువు తగ్గట్లేదు అని కోప్పడద్దు. ఓపికతో మీరు బరువు తగ్గడానికి ప్రయత్నం చేయండి. కచ్చితంగా బరువు తగ్గొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now