Tomatoes : షుగర్ ఉన్నవాళ్లు టమాటాలని తీసుకోవచ్చా..?

August 18, 2023 2:07 PM

Tomatoes : చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి..?, ఎటువంటివి తీసుకోకూడదు అనేది అడిగి ఆరోగ్య నిపుణుల‌ సలహా మేరకు తీసుకోవాలే తప్ప అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఏమైనా సందేహాలు ఉంటే క్లియర్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చాలామంది షుగర్ పేషెంట్లకి టమాటాలని తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. టమాటాలను తీసుకుంటే ఏమవుతుంది..?, ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే సందేహం మీలో కూడా ఉన్నట్లయితే ఇప్పుడే తెలుసుకోండి.

రోజూ ఆహారంలో టమాటాలను తీసుకోవడం వలన సహజంగా ఇన్సులిన్ స్థాయిలని నిర్వహించడానికి సహాయపడుతుంది. టమాటాలను తీసుకుంటే షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. టమాటాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, పొటాషియంతోపాటుగా లైకోపీన్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. కణాలని రిపేర్ చేయడానికి ఇవి సహాయపడతాయి.

can diabetics take tomatoes
Tomatoes

టమాటాలతో గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. గుండె సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. టమాటాలను తీసుకుంటే, ఇన్సులిన్ స్థాయిలు సహజంగా నిర్వహించబడతాయి. టమాటాలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, తీసుకోవడం వలన ఆకలిని నియంత్రిస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ కి దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు.

స్టార్చ్ ఉండదు కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనుకూలంగా ఉంటుంది. టమాటాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీన్ని డయాబెటిక్ ఫ్రెండ్లీ కూర‌గాయ‌ అని చెప్పొచ్చు. సో, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏ భయం లేకుండా టమాటాలని తీసుకోవచ్చు. పైగా టమాటాలను తీసుకోవడం వలన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దృష్టిని కూడా మెరుగుపరచుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. ఎముకలకి కూడా టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. కొవ్వుని కరిగించడానికి కూడా టమాటాలు బాగా ఉపయోగపడతాయి. ఇలా టమాటాలతో ఎన్నో లాభాలని పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment