Broccoli : కాలిఫ్ల‌వ‌ర్‌లాగే ఉండే దీని గురించి తెలుసా..? అస‌లు మిస్ చేసుకోకుండా తినండి..!

August 12, 2023 9:57 PM

Broccoli : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటే, మన ఆరోగ్యం బాగుంటుంది. వీలైనంత వరకు పోషకాహారాల మీద దృష్టి పెట్టాలి, పోషకాహారాన్ని తీసుకుంటే, ఆరోగ్యంగా జీవించ‌వ‌చ్చు. ఆకుకూరలు, కూరగాయలు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలానే, చాలా మంది కాలీఫ్లవర్ లాగా వుండే బ్రోకలీ ని తీసుకోరు. ఎక్కువ మందికి దీని వలన కలిగే లాభాల గురించి తెలీదు. బ్రోకలీని తీసుకోవడం వలన అనేక‌ రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

కాలీఫ్లవర్ లాగా వుండే బ్రోకలీని తీసుకుంటే, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇక మనం బ్రోకలీ తిన‌డం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. బ్రోకలీలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రోకలీ లో విటమిన్ కె, డైట‌రీ ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియం, మాంగనీస్, క్యాల్షియంతోపాటుగా ప్రోటీన్స్, జింక్ వంటివి కూడా ఉంటాయి.

Broccoli amazing health benefits take regularly
Broccoli

బ్రోకలీని తీసుకుంటే, ఇలా అనేక లాభాలని మనం పొందవచ్చు. ప్రత్యేకమైన కార్బన్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. బ్రోకలీని మనం సలాడ్ రూపంలో కానీ ఇంకా ఏదైనా రూపంలో అయినా కూడా తీసుకోవచ్చు. వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. బ్రోకలీని తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

డయాబెటిస్ ఉన్న వాళ్లు రక్తంలో చక్కెర స్థాయిల‌ను తగ్గించుకోవడానికి బ్రోకలీని తీసుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని కూడా మనం పెంచుకోవచ్చు. బరువు తగ్గడానికి, ఊబకాయంతో బాధపడే వాళ్ళు కూడా బ్రోకలీని తీసుకోవచ్చు. కాలేయానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. అలానే ఎముకలకు కూడా బ్రోకలీ చాలా మేలు చేస్తుంది. ఇలా బ్రోకలీ వలన ఇన్ని లాభాలను మనం పొందడానికి అవుతుంది. మన ఆరోగ్యాన్ని మరింత పెంపొందించుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment