Blueberries : రోజూ గుప్పెడు చాలు.. మీ మెద‌డు కంప్యూట‌ర్ క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..!

September 24, 2023 7:55 PM

Blueberries : ఆరోగ్యానికి బ్లూబెర్రీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. బ్లూబెర్రీస్ తో బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. అలానే, బ్లూ బెర్రీస్ తీసుకోవడం వలన చాలా రకాల లాభాలని పొందవచ్చు. నీలం రంగులో ఉంటాయి ఇవి. చాలా తియ్యగా రుచిగా ఉంటాయి. పోషకాలు కూడా బ్లూబెర్రీస్ లో ఎక్కువ ఉంటాయి. బ్లూ బెర్రీస్ తో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. అలానే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. బ్లూబెర్రీస్ ని తీసుకుంటే, ఎలాంటి లాభాలను పొందవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లూబెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్. రక్తం నుండి ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తాయి. క్యాన్సర్ తో సహా అనేక రకాల సమస్యల్ని, బ్లూ బెర్రీస్ తొలగించగలవు. రెగ్యులర్ గా బ్లూబెర్రీస్ ని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. హృదయ సమస్యల కి దూరంగా ఉండొచ్చు. బ్లూబెర్రీస్ ని తీసుకుంటే, జీర్ణ సమస్యల నుండి కూడా బయటపడొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఎక్కువ ఉంటాయి.

Blueberries amazing health benefits
Blueberries

క్యాన్సర్, గుండె జబ్బులు, ఆల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు సంభవించవు. రెగ్యులర్ గా బ్లూ బెర్రీస్ ని తీసుకోవడం వలన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుండి కూడా దూరంగా ఉండొచ్చు. బ్లూ బెర్రీస్ తీసుకుంటే, కొవ్వు కూడా బాగా తగ్గుతుంది. బ్లూ బెర్రీస్ ని తీసుకోవడం వలన రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ల‌కు చక్కటి ఫలితం ఉంటుంది.

ఉబకాయం వంటి సమస్యలు కూడా ఉండవు. టైప్ 2 డయాబెటిస్ కూడా బాగా తగ్గుతుంది. బ్లూ బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లూ బెర్రీస్ ని తీసుకోవడం వలన చర్మ సౌందర్యం కూడా బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు మృత కణాల్ని సమర్థంగా తొలగించి, పగుళ్లు లేకుండా చర్మాన్ని మార్చగలవు. బ్లూ బెర్రీస్ తో బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు. డైట్రి ఫైబర్ ఇందులో ఎక్కువ ఉంటుంది. బరువు తగ్గడానికి బ్లూ బెర్రీస్ బాగా ఉపయోగపడతాయి. ఇలా అనేక రకాల లాభాలను మనం బ్లూ బెర్రీస్ తో పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment