Blood Circulation : రక్తప్రసరణ బాగా జరిగి.. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

December 9, 2023 3:58 PM

Blood Circulation : చాలామంది, ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు కారణంగా బాధపడుతున్నారు. రక్త ప్రసరణ వ్యవస్థ శరీరం అంతటా రక్తం, ఆక్సిజన్ పోషకాలని ఇస్తుంది. శరీరంలోని కొన్ని ప్రధాన భాగాలకి రక్తప్రసరణ తగ్గితే, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తం గడ్డ కట్టడం వంటివి కూడా జరుగుతాయి. రక్తప్రసరణ సరిగా జరగదు. రక్తప్రసరణ సరిగా లేకపోతే, కండరాలు తిమ్మిరి, జలదరింపు, అవయవాల్లో నొప్పి వంటివి కనపడుతూ ఉంటాయి. రక్తప్రసరణలో లోపాలు వచ్చినట్లయితే, ఇలా సమస్య నుండి బయటపడొచ్చు.

శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా లేకపోతే జీర్ణ సమస్యలు, చేతులు లేదా కళ్ళల్లో చల్లదనం, కండరాలు తిమ్మిరి, నొప్పి ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. మిరియాలు రక్తప్రసరణ కి బాగా ఉపయోగపడతాయి. ఫైటో కెమికల్స్ మిరియాల లో ఉంటాయి. రక్తప్రసరణ ని ఇది పెంచుతుంది. రక్తనాళాలకు బలాన్ని ఇవ్వడంతో పాటుగా, ధమనుల్లో ఫలకం ఏర్పడడాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. నొప్పిని తగ్గించే క్రీముల్లో కూడా మిరియాలను వాడడం జరుగుతుంది. రక్తనాళాల గోడల్లో ఉండే చిన్న కండరాలని సడలించడం ద్వారా, రక్తాన్ని శిరలు ధమనుల ద్వారా మరింత సులభంగా ప్రవహించేటట్టు చూస్తుంది.

Blood Circulation tips follow these for better health
Blood Circulation

దానిమ్మ పండ్లు కూడా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తప్రసరణ బాగా జరిగేటట్టు దానిమ్మ పండ్లు చూస్తాయి. ప్రతిరోజు వ్యాయామానికి ముందు దానిమ్మ పండ్లు తీసుకుంటే, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఉల్లిపాయలు తీసుకుంటే కూడా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత, ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే, రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.

చూశారు కదా రక్తప్రసరణ బాగా జరగడానికి ఎటువంటి వాటిని తీసుకోవాలి అనేది. ఇలా, మీరు ఈ ఆహార పదార్థాలని డైట్ లో తీసుకున్నట్లయితే, కచ్చితంగా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అనేక సమస్యలను దూరంగా ఉండొచ్చు. దాల్చిన చెక్క కూడా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ దాల్చినతో మెరుగుపడుతుంది. దాల్చిన చెక్క బెరడు సారాన్ని ప్రతి రోజు 8 వారాల పాటు తీసుకుంటే, హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now