ఆరోగ్యం

Black Sesame Seeds : పురుషుల‌కు ఎంతో మేలు చేసే న‌ల్ల నువ్వులు.. ఎముక‌ల పుష్టికి వ‌రం..!

Black Sesame Seeds : నువ్వుల గురించి మ‌న‌లో చాలా మందికి తెలుసు. వీటిని అనేక ర‌కాల వంటల్లో వేస్తుంటారు. వీటితో స్వీట్లు చేస్తారు. నువ్వుల నుంచి తీసిన నూనెను వాడితే ఎంతో మేలు జ‌రుగుతుంది. నువ్వుల‌ను, దాని నూనెను ఆయుర్వేదంలో విరివిగా ఉప‌యోగిస్తారు. అయితే నువ్వుల్లో ఇంకో ర‌కం నువ్వులు కూడా ఉంటాయి. సాధార‌ణంగా మ‌నం చూసేవి తెల్ల నువ్వులు. కానీ న‌ల్ల నువ్వులు కూడా ఉంటాయి. వీటితో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. న‌ల్వ నువ్వుల వ‌ల్ల ఎలాంటి లాభాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

న‌ల్ల నువ్వుల్లో మ‌న శరీరానికి మేలు చేసే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజ‌రైడ్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే అధిక బ‌రువు త‌గ్గుతారు. కొవ్వు క‌రిగిపోతుంది. న‌ల్ల నువ్వుల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క‌నుక మాంసాహారం తిన‌ని వారు ఈ నువ్వుల‌ను తిన‌డం ద్వారా ప్రోటీన్ల‌ను పుష్క‌లంగా పొంద‌వ‌చ్చు. ప్రోటీన్లు మ‌న శ‌రీర నిర్మాణానికి కండ‌రాల పెరుగుద‌ల‌కు, శ‌క్తికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క‌నుక న‌ల్ల నువ్వుల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. కేవ‌లం 3 టేబుల్ స్పూన్ల న‌ల్ల నువ్వుల‌ను రోజూ తింటే చాలు.. 30 గ్రాముల ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి.

Black Sesame Seeds

న‌ల్ల నువ్వుల్లో కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది. అలాగే మెగ్నిషియం, మాంగ‌నీస్, కాప‌ర్‌, జింక్‌, ఫాస్ఫ‌ర‌స్ కూడా స‌మృద్ధిగానే ఉంటాయి. ఇవ‌న్నీ ఎముక‌ల నిర్మాణానికి, ఎముక‌లను బ‌లంగా ఉంచేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. దీంతో వృద్ధాప్యంలో వ‌చ్చే ఎముక‌ల సంబంధ‌మైన ఆస్టియోపోరోసిస్‌, ఆర్థ‌రైటిస్ వంటి కీళ్ల స‌మ‌స్య‌లు రాకుండా నిరోధించ‌వ‌చ్చు. న‌ల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో బి కాంప్లెక్స్ విట‌మిన్ల‌తోపాటు విట‌మిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని ఆక్సీక‌ర‌ణ డ్యామేజ్ నుంచి ర‌క్షిస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్ప‌త్తికి స‌హాయ ప‌డుతుంది. దీని వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

న‌ల్ల నువ్వుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని రోజూ తింటే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే న‌ల్ల నువ్వుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. ఇవి పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి. వీర్యం ఉత్ప‌త్తి చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క‌నుక వీటిని రోజూ తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM