Anjeer : చాలా మంది ప్రతి రోజూ పండ్లతోపాటు డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. అంజీరని కూడా చాలా మంది రోజు తీసుకుంటూ ఉంటారు. అంజీర పండ్లని తీసుకోవడం వలన చక్కటి లాభాలని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంజీర పండ్లను తీసుకోవడం వలన చక్కటి లాభాలను పొందవచ్చు. అంజీర పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంజీర పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
రాత్రిపూట వీటిని నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకుంటే మంచిది. అంజీర ముక్కల్ని రెండు నుండి నాలుగు తీసుకోవచ్చు. ఇప్పుడు వాటిని తీసుకుని ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి వాటిని రాత్రంతా నానబెట్టి, ఉదయం నీటిలో నుండి తీసేశాక పరగడుపున వీటిని తీసుకోవడం మంచిది. అంజీర పండ్లను తినడం వలన మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది.
అంజీర పండు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంజీర పండ్లను తీసుకోవడం వలన క్యాల్షియం ఎక్కువగా అందుతుంది. ఎముకలకి అవసరమైన క్యాల్షియంని ఈ పండ్లతో పొందవచ్చు. అంజీర పండ్లలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఫైబర్ వీటిలో ఎక్కువ ఉంటుంది. నానబెట్టిన అంజీర పండ్లను తీసుకుంటే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది.
చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి వాటిని తీసుకునే బదులు, భోజనం తర్వాత అంజీర పండ్లని తీసుకోవచ్చు. డయాబెటిస్ తో బాధ పడే వాళ్ళు అంజీర పండ్లను తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చాలా తక్కువ సోడియం ఉంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలని మనం ఈ పండ్లని తీసుకొని పొందవచ్చు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…