Aloe Vera For Hair : క‌ల‌బంద‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పెర‌గ‌డాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

November 17, 2023 9:45 PM

Aloe Vera For Hair : ప్రతి ఒక్కరు కూడా, అందమైన కురులని పొందాలని అనుకుంటుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా, చాలామంది వాడుతూ ఉంటారు. జుట్టు రాలకుండా, చుండ్రు లేకుండా, జుట్టు ఒత్తుగా పొడుగ్గా ఎదగాలంటే కొంచెం కష్టమే. కానీ, ఇంటి చిట్కాలు ప్రయత్నం చేసి, మనం జుట్టుని అందంగా మార్చుకోవచ్చు. ఈ రోజుల్లో జీవనశైలి మారిపోయింది. ఒత్తిడి ఎక్కువ అవుతోంది. కాలుష్యం వలన కూడా జుట్టు దెబ్బతింటుంది. వయసుతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరిలో కూడా జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య ఉంటుంది.

ఈ సమస్య నుండి, బయటపడడానికి ఇంటి చిట్కాలు చక్కగా పని చేస్తుంది, ఇలా చేయడం వలన జుట్టు రాలిపోతుంది కూడా. చుండ్రు తగ్గుతుంది. దీని కోసం ముందు ఒక బౌల్ తీసుకొని, నాలుగు స్పూన్ల కలబంద గుజ్జు, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి. రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసి, తర్వాత కొబ్బరి నూనె వేసి మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేయండి.

Aloe Vera For Hair follow this remedy that works for you
Aloe Vera For Hair

కుదుళ్ల నుండి చివర్ల దాకా బాగా పట్టించేసి, గంట సేపు అలా వదిలేసి, కుంకుడు కాయతో తల స్నానం చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే, జుట్టు రాలడం తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది. అలానే, సిల్కీగా కూడా మారుతుంది. పొడి జుట్టు సమస్య నుండి కూడా బయటపడవచ్చు.

కలబందలో ఉండే అమైనో యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కలబంద గుజ్జు లో ఉండే చక్కటి గుణాలు జుట్టుని బాగా కాపాడగలవు. జుట్టుని ఆరోగ్యంగా మార్చగలవు. ఆలివ్ ఆయిల్ కూడా మంచి పోషణను ఇస్తుంది. దురద, చుండ్రు తగ్గుతాయి. కాబట్టి, ఈ విధంగా మీరు అనుసరిస్తే సరిపోతుంది. జుట్టు చాలా అందంగా మారిపోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now