రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతి రోజు వారి ఆహారంలో ఉపయోగించే కూరలలో తప్పనిసరిగా ఉండేది టమోటా పప్పు. టమోటా పప్పు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎంతో రుచికరమైన టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
*కందిపప్పు ఒక కప్పు
*టమోటాలు 4
*పచ్చిమిర్చి సరిపడినంత
*టేబుల్ టీ స్పూన్ పసుపు
*ఉల్లిపాయ ఒకటి
*వెల్లుల్లి రెబ్బలు
*కొత్తిమీర
*కరివేపాకు
*నిమ్మ పండు సైజు చింతపండు
*జీలకర్ర
*ఆవాలు
*ఎండు మిర్చి ముక్కలు
*కొద్దిగా నూనె
ముందుగా ప్రెషర్ కుక్కర్ లో కందిపప్పు ను కడిగి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి టమోటాలను ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, ఒక కరివేపాకు రెమ్మ, చిటికెడు పసుపు, చింతపండు కడిగి కుక్కర్లో వేసుకోవాలి. అనంతరం మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడకనివ్వాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రెజర్ పోయిన తర్వాత పప్పు రాముకోవాలి. తరువాత పప్పుకు పోపు పెట్టుకోవాలి.
స్టవ్ పై వేరే కడాయి తీసుకొని అందులో మూడు టేబుల్ టీ స్పూన్ల నూనెను వేసి నువ్వు బాగా వేడెక్కాక అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఆవాలు చిటపట అన్న తరువాత పోపు పప్పులో వేయడంతో ఎంతో రుచికరమైన టమాటా పప్పు తయారైనట్లే. వేడి వేడి అన్నంలోకి టమోటా పప్పు కలుపుకుని తింటే ఆ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…