సాధారణంగా గారెలు అంటే మినప్పప్పు అలసంద పప్పుతో తయారు చేసుకొని తింటాము. కానీ కాస్త భిన్నంగా చికెన్, పెసరపప్పును కలిపి తయారు చేసుకునే గారెలు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. మరి చికెన్ – పెసర గారెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
*చికెన్ తురుము అర కప్పు
*పెసలు ఒక కప్పు
*పచ్చిమిర్చి నాలుగు
*టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు
*గరం మసాల కొద్దిగా
*జీలకర్ర అర టీ స్పూన్
*ఉప్పు తగినంత
*కొత్తిమీర తురుము
*బేకింగ్ సోడా చిటికెడు
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
*ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
ముందుగా పెసరపప్పును నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే విధంగా చికెన్ శుభ్రం చేసి బాగా ఉడికించి చికెన్ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చికెన్ నానబెట్టిన పెసరపప్పును మిక్సీలో వేసుకుని అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి కొత్తిమీర తురుము, తగినంత ఉప్పు, గరం మసాలా, బేకింగ్ సోడా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై నూనెను వేసి బాగా మరిగించాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత గారెలు వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చికెన్ పెసర గారెలు ఎంతో రుచికరంగా ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…