Ragi Idli : చిరుధాన్యాల్లో ఒకటైన రాగుల్లో పోషకాలు అనేకం ఉంటాయి. షుగర్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచిది. రాగి అంబలి మాత్రమే కాకుండా ఒకసారి రాగిపిండితో ఇడ్లీలు కూడా చేసుకుని తినండి. రవ్వ, పెరుగుతో కలిపి చేయడం వల్ల వీటికి మంచి రుచి వస్తుంది. నూనె లేకుండా, పిండి పులియ బెట్టాల్సిన అవసరం లేకుండా వెంటనే అప్పటికప్పుడు ఈ ఇడ్లీలను చేసుకోవచ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
రాగి ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు..
రాగి పిండి – 1 కప్పు, సన్న రవ్వ – 1 కప్పు, ఉప్పు – తగినంత, పెరుగు – 1 కప్పు, నీళ్లు – 1 కప్పు, బేకింగ్ సోడా – పావు టీస్పూన్.
రాగి ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా నూనె లేకుండా రవ్వను రెండు నిమిషాలు వేయించాలి. పెద్ద గిన్నెలోకి రవ్వను తీసుకుని రాగిపిండిని కలుపుకోవాలి. ఉప్పు, పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. పెరుగు చిక్కదనాన్ని బట్టి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఈ పిండిని అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంటయ్యాక అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోసుకుని ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఆవిరి మీద ఇడ్లీ ఉడికించుకునే ముందు కొద్దిగా బేకింగ్ సోడా కూడా కలుపుకోవాలి. దీంతో ఇడ్లీలు గట్టిగా లేకుండా పొంగుతూ వస్తాయి. ఇక ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీ పాత్రలకి నూనె రాసి ఇడ్లీ పిండిని వేసుకోవాలి. మామూలు ఇడ్లీ లాగే ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు. రాగి పిండి ఇడ్లీలు తయారవుతాయి. వీటిని సాంబార్ లేదా చట్నీతో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యకరం కూడా.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…