Chintha Chiguru : చింతచిగురు ఎక్కువగా వేసవిలో దొరుకుతుంది. చింతచిగురు గురించి తెలియని వారుండరు. కానీ కొంత మందికి చింతచిగురు గురించి తెలియదు. ఆకు రాల్చే కాలంలో అన్ని చెట్ల మాదిరే చింత చెట్ల ఆకులు కూడా రాలి పోతాయి. ఆ తర్వాత వాటి స్థానంలో లేత చిగురులు వస్తాయి. అంటే చింతచిగురు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చాలా విరివిగా లభిస్తుందన్నమాట. ఈ చిగురులను సేకరించి పచ్చడి, పప్పు, కూరల్లో వాడటం మనకు తెలిసిన విషయమే. చింత చిగురుతో కొన్ని వంటకాలు చేసుకుంటారు. చింతచిగురు రుచికి పుల్లగా ఉంటుంది కాబట్టి చింత చిగురు వేసిన కూరల్లో చింత పండు వేయరు.
చింత చిగురులో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో పుష్కలంగా ఉంటాయి. పుల్లని రుచితో ఉండే చింతచిగురులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చింత చిగురులో ఉండే ఐరన్, విటమిన్స్ ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించటంలో సహాయం చేస్తాయి. ఇప్పుడు ఈ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చింతచిగురు తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఆ ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మనం రోజూ వాడే చింతపండులో కన్నా చింతచిగురు లోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చింత చిగురులో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. చింతచిగురులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో అనేక రోగాల నుండి బయట పడేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా చింతచిగురుకు సాటి ఏదీ లేదు. ఆయుర్వేదంలో మలేరియా జ్వరానికి చింతచిగురు రసం తాగమని చెబుతారు. చింత చిగురులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత నుండి కాపాడుతుంది. చింత చిగురు దొరికే కాలంలో ఎక్కువగా తెచ్చుకొని ఎండబెట్టి సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…